కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

ABN, First Publish Date - 2023-11-14T19:44:25+05:30

లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Roti Kapda Romance Movie Still

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal).. సృజన్‌ కుమార్ బొజ్జం (Srujan Kumar Bojjam) తో కలిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapda Romance). హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ఈ ఫస్ట్ లుక్ వైవిధ్యంగా ఉంది. (Roti Kapda Romance First Look Out)


ఈ ఫస్ట్ లుక్‌లో హీరోలు నలుగురు కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇందులో వైజాగ్ బీచ్‌ని తలపిస్తూ.. పెద్ద సైజులో మందు బాటిల్, లైట్ హౌస్, సముద్రం, సముద్రపు ఒడ్డున ఇసుకలో సోఫా, ఆ సోఫాలో ముగ్గురు హీరోలు కూర్చుంటే.. కింద ఇసుకలో మరో హీరో కూర్చుని ఉన్నారు. ఓ చెక్క బల్లతో పాటు, ఓల్డ్ టీవీని కూడా ఇందులో గమనించవచ్చు. ఏదో పోగొట్టుకున్న వాళ్లలా.. లేదంటే, ఎవరో వస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో డిజప్పాయింట్ అయినట్లుగా హీరోల ముఖాలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ యూత్‌ని ఆకర్షించేలా ఉండటంతో పాటు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్ర విడుదల వివరాలను త్వరలోనే నిర్మాతలు తెలియజేయనున్నారు. (Roti Kapda Romance First Look Talk)


ఇవి కూడా చదవండి:

========================

*Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

*****************************

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

Updated Date - 2023-11-14T19:44:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!