Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

ABN , First Publish Date - 2023-11-14T15:07:42+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. దీపావళి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన టీమ్.. మళ్లీ షూటింగ్‌లో బిజీ అయినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా 5 ఏప్రిల్, 2024న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!
Devara Movie Poster

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మేకర్స్ ఓ మాసివ్ అప్‌డేట్‌ని వదిలిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో రూపుదిద్దుకుంటోన్న స్టార్ హీరోల సినిమాలు కొన్ని.. రెండు పార్ట్‌లగా తెరకెక్కినట్టే.. ఈ సినిమా కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతోందని.. దర్శకుడు కొరటాల శివ అధికారికంగా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి మరీ ఈ విషయాన్ని తెలియజేశారు. అంతే కాదు, ‘దేవర పార్ట్ 1’ (Devara Part 1)ను 5 ఏప్రిల్, 2024న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయన చెప్పినట్టే.. ఈ సినిమాని శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

‘దేవర’ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా.. అది వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన అప్‌డేట్‌తో మరోసారి ‘దేవర’ ట్యాగ్.. ట్రెండ్‌‌ని షేక్ చేస్తోంది. ఇంతకీ అప్‌డేట్ ఏమిటంటే.. దీపావళి (Diwali) ఫెస్టివల్‌ను పురస్కరించుకుని చిత్రయూనిట్ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారో కూడా అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీవాళి బాస్‌‌కి ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. అలాగే దీవాళిని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న పిక్‌ని కూడా సోషల్ మీడియా వేదికగా తారక్ షేర్ చేశారు. ఇక బ్రేక్ తర్వాత మళ్లీ టీమ్ షూటింగ్‌లో బిజీ అయినట్లుగా ‘దేవర’ యూనిట్ అధికారికంగా తెలియజేసింది. (Man of The Masses Film Update)


Young-Tiger.jpg

‘‘దీపావళి ఫెస్టివల్ కోసం తీసుకున్న చిన్న బ్రేక్ అనంతరం.. మా హార్డ్ వర్కింగ్ టీమ్ అంతా మరో అద్భుతమైన షెడ్యూల్ కోసం సెట్‌లోకి వచ్చేశారు. ఈ గ్రాండియర్ చిత్రం (దేవర పార్ట్ 1)ని 5 ఏప్రిల్, 2024న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది’’ అని.. ‘దేవర’ అధికారిక ఎక్స్ (Devara X Page) పేజీలో ట్వీట్ చేశారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ (Young Tiger Fans) కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్‌కి ఫస్ట్ సింగిల్ వదిలేలా ప్లాన్ చేయండి అంటూ యూనిట్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

Updated Date - 2023-11-14T15:07:43+05:30 IST