scorecardresearch

Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

ABN , First Publish Date - 2023-11-12T16:23:40+05:30 IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు మూవీ టీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి
Family Star Movie Still

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) నుంచి దీపావళి (Diwali) శుభాకాంక్షలు తెలియజేశారు మూవీ టీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ సినిమా ఇది. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ.. తాజాగా మేకర్స్ ఓ ఫెస్టివల్ లుక్ పోస్టర్ వదిలారు.

ఈ పోస్ట‌ర్‌లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి (Sankranthi)కి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.


VD14.jpg

టీజర్‌లో (Family Star Teaser)..ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్‌గా.. బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కనిపించారు. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకున్నావా? మగతనం అంటే.. అని విలన్ ఎగతాళిగా మాట్లాడితే.. ‘భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన విజయ్.. విలన్ గ్యాంగ్‌లోని ఒకడి తల పగలగొట్టి సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా.. అని విలన్‌కు షాక్ ఇవ్వడం కూల్ హీరోయిజాన్ని చూపించింది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!

******************************

*Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..

*********************************

*Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

*******************************

Updated Date - 2023-11-12T16:23:41+05:30 IST