Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

ABN , First Publish Date - 2023-11-12T17:34:27+05:30 IST

మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా.. ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ డైరెక్ష‌న్‌‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సంక్రాంతికి సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌
Lal Salaam Movie Still

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎన్నో మ‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌డ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మ‌న‌లో మ‌న‌కు గొడ‌వ‌లు పెట్టారు. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రిగింది. అయితే ఇలాంటి చెడు ప‌రిమాణాల నుంచి ప్ర‌జ‌ల‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్‌. మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది తెలుసుకోవాలంటే ‘లాల్ స‌లామ్‌’ (Lal Salaam) సినిమా చూడాల్సిందేనంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. మొయిద్దీన్ భాయ్ (Moinuddin Bhai) పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ (Super Star Rajinikanth) న‌టించిన ఈ సినిమా.. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని.. రానున్న సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. (Lal Salaam Teaser Out)

దీపావ‌ళి పండుగను పురస్కరించుకుని ‘లాల్ స‌లామ్‌’ చిత్రం నుంచి టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం ఏంటి? క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు.. వారిలో ఒక‌రు హిందు, మ‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌రి మ‌న‌సుల్లో మ‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డే స‌న్నివేశాలు, దాని వ‌ల్ల వారిద్ద‌రూ మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. ఆట‌లో మ‌తాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్ల‌ల మ‌న‌సుల్లో విషాన్ని నింపారు అని అక్క‌డున్న పెద్ద‌ల‌ను మొయిద్ధీన్ పాత్ర తిడుతుంది. అలాగే హిందు, ముస్లింలు గొడ‌వ ప‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే క‌థాంశంతో ‘లాల్ స‌లామ్’ రూపొందింద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఎప్ప‌టిలాగానే సూప‌ర్ స్టార్ రజనీకాంత్ త‌న‌దైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనున్నారు. మరీ ముఖ్యంగా ఆయన లుక్, పాత్ర తీరు ‘జైలర్’ని తలపిస్తుండటం విశేషం. విష్ణు విశాల్‌ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) యువ క్రికెట‌ర్స్‌గా అలరించబోతున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.


Rajini.jpg

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ (Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ కూడా కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

*Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!

******************************

*Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..

*********************************

*Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

*******************************

Updated Date - 2023-11-12T17:34:28+05:30 IST