Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

ABN , First Publish Date - 2023-04-02T16:23:53+05:30 IST

కాంతార (Kantara) సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

కాంతార (Kantara) సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీతో రిషబ్ దేశవ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నారు. అయితే, రిషబ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట షికార్లు కొడుతుంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి స్పందించారు.

ట్విటర్‌లో రిషబ్‌ శెట్టి ఫొటోను ఒ జర్నలిస్ట్ షేర్‌ చేశారు. ‘‘రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది నేటి అతిపెద్ద వార్త’’ అని రాసి రిషబ్‌ను ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీట్‌కు రిషబ్‌ రిప్లై ఇచ్చారు. ‘‘నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తున్న వార్త నిజం కాదు. ఇది రూమర్‌ మాత్రమే. నేను రాజకీయాల్లోకి రావడం లేదు’’ అని రిషబ్ పేర్కొన్నారు. ‘‘మీరు రాజకీయాల్లోకి రండి. మేం మద్దతు ఇస్తాం’’ అని కొందరు అభిమానులు కామెంట్స్‌ చేశారు. రిషబ్‌ వారికి కూడా రిప్లై ఇచ్చారు. ‘‘నాకు రాజకీయపరమైన మద్దతు అవసరం లేదు. సినిమాలను ఆదరిస్తే చాలు. నాపై ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని రిషబ్ తెలిపారు.

Kantara.jpg

‘కాంతార’ సంచలన విజయం సాధించడంతో రెండో భాగాన్ని తెరకెక్కించే పనిలో మేకర్స్ పడ్డారు. ఇప్పటికే స్క్రిఫ్ట్ పనులను మొదలుపెట్టారు. ‘కాంతార 2’ అనేది సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని చెప్పారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ‘కాంతార’ రెండో భాగం 2024లో విడుదలవుతుందని స్పష్టం చేశారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-02T16:24:24+05:30 IST