RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో‌ వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్

ABN , First Publish Date - 2023-09-19T20:39:26+05:30 IST

దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ‘రామ్‌’ (RAM-ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమాని రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌ను డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో‌ వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్
Rapid Action Mission Movie Pic

ఈ మధ్యకాలంలో నిజ జీవిత కథలపై దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా మక్కువ ఎక్కువ పెడుతున్నారు. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు మ్యాగ్జిమమ్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడలాంటి ఓ కథతోనే దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ‘రామ్‌’ (RAM-ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమాని రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌ను డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూసిన పరశురామ్.. యూనిట్‌ను అభినందించి.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. (RAM Rapid Action Mission Glimpse)

ఇక ఈ గ్లింప్స్‌లో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ అందరినీ ఆకర్షిస్తోంది. హీరో డైలాగ్ డెలివరీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా ఉంటే.. ఈ సీన్ షూట్ చేసిన లొకేషన్ హీరో పవర్ ఫుల్ డైలాగ్‌కి యాప్ట్ అనేలా ఉంది. మొత్తంగా చూస్తే ఈ గ్లింప్స్ సినిమా స్థాయిని తెలియజేస్తుంది. ఇక రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం ఈ మూవీ రేంజ్ ఏంటో చెబుతోంది. ఈ టైటిల్ లుక్ తోనే సినిమాపై మేకర్స్ భారీగా అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Ram.jpg

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula) హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?

***************************************

*Devil: సింగర్ సిద్ శ్రీరామ్.. మరోసారి మాయ చేసేశాడు

***************************************

*Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్‌’ విలన్‌

**************************************

*Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్

***************************************

Updated Date - 2023-09-19T20:39:26+05:30 IST