Devil: సింగర్ సిద్ శ్రీరామ్.. మరోసారి మాయ చేసేశాడు

ABN , First Publish Date - 2023-09-19T17:25:08+05:30 IST

విలక్షణమైన పాత్రలతో.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్‌గా పేరు పొందిన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మాయే చేసి’ అంటూ సాగిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

Devil: సింగర్ సిద్ శ్రీరామ్.. మరోసారి మాయ చేసేశాడు
Kalyan Ram and Samyuktha Menon

తన గాత్రంతో మెస్మరైజ్ చేస్తూ.. స్టార్ సింగర్‌గా దూసుకెళుతోన్న సిద్ శ్రీరామ్ (Sid Sriram).. మరోసారి తన మ్యాజిక్ వాయిస్‌తో మాయ చేసేశాడు. విలక్షణమైన పాత్రలతో.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా.. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్‌గా పేరు పొందిన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘డెవిల్’ (Devil). ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసేంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ (First Single)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఐకాన్ మ్యూజిక్ (Icon Music) ద్వారా మార్కెట్‌లోకి విడుదలైన ఈ పాట శ్రోతల్ని అలరిస్తోంది.

‘మాయే చేసి మెల్లగా..’ అంటూ సాగిన ఈ పాటను గమనిస్తే ఇదొక మెలోడీ సాంగ్. పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు అందమైన అనుభూతికి లోనవుతారు. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్‌డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం ఇంకా హైలైట్‌గా నిలిచింది. కచ్చితంగా ఈ పాట ఆడియెన్స్ ప్లే లిస్ట్‌లో రిపీటెడ్ సాంగ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. (Maaye Chesi Mellgaa Song Out)


Kalyan-Ram-1.jpg

ఈ పాటకు బృంద మాస్టర్ నృత్యాన్ని సమకూర్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సూపర్బ్ రెట్రో ట్రాక్‌ను అందించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ (Samyuktha Menon) మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మాయే చేశావే.. సాంగ్‌తో మేకర్స్ ఓ ఎగ్జయిటింగ్ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్తల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, కథనం, మాటలను సమకూర్చారు. ఈ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ స్పై థ్రిల్లర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్‌’ విలన్‌

**************************************

*Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్

***************************************

*Jithender Reddy: ‘జితేందర్‌ రెడ్డి’ ఎవరో తెలిసేది అప్పుడే..

***************************************

*Klin Kaara: 3 నెల‌ల పాటు అమ్మ‌మ్మగారి ఇంట్లో ఉండి వచ్చిన ‘క్లీంకార’కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం

************************************

Updated Date - 2023-09-19T17:25:08+05:30 IST