Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్

ABN , First Publish Date - 2023-09-18T21:01:47+05:30 IST

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్‌’. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వినాయక చవితిని పురస్కరించుకుని.. చిత్రయూనిట్ ఓ ఎక్సలెంట్ పోస్టర్‌ని విడుదల చేసింది.

Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్
Hanu Man Movie New Still

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్‌’ (Hanu-Man). యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ వుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు బెస్ట్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టీజర్‌కి అన్ని భాషల్లోనూ అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో వారు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. తాజాగా హను-మాన్ టీమ్ అందరికీ గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పండుగ సందడితో నిండిన పర్ఫెక్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించినట్లుగా హింట్ ఇచ్చేశారు.

ఈ పోస్టర్‌లో తేజ సజ్జా ట్రెడిషినల్ అవతార్‌లో కనిపించారు. తన చుట్టూ భారీ గుంపుతో గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్నారు. మేకర్స్ త్వరలో మరికొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది. (Hanu-Man New Poster)


Sajja.jpg

హను-మాన్ ‘అంజనాద్రి’ ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 12 జనవరి, 2024న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవి కూడా చదవండి:

============================

*Jithender Reddy: ‘జితేందర్‌ రెడ్డి’ ఎవరో తెలిసేది అప్పుడే..

***************************************

*Klin Kaara: 3 నెల‌ల పాటు అమ్మ‌మ్మగారి ఇంట్లో ఉండి వచ్చిన ‘క్లీంకార’కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం

************************************

*Naga Susheela: కింగ్ నాగార్జున సోదరిపై కేసు నమోదు

************************************

*Chiranjeevi: చిన్ని క్లీంకారతో వినాయక చవితి సెలబ్రేషన్.. పిక్స్ వైరల్

***********************************

*Mahima Nambiar: క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమందంటే..

***********************************

Updated Date - 2023-09-18T22:20:34+05:30 IST