Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్‌’ విలన్‌

ABN , First Publish Date - 2023-09-19T16:09:02+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన మలయాళ నటుడు వినాయకన్‌ ఇపుడు పాపులర్‌ విలన్‌గా మారిపోయారు. ఫలితంగా ఆయనకు వరుస సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆయన ‘జైలర్’ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలకంటే మూడింతలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వినాయకన్ చెప్పుకొచ్చారు.

Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్‌’ విలన్‌
Jailer Villain Vinayakan

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) ‘జైలర్‌’ (Jailer) చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన మలయాళ నటుడు వినాయకన్‌ (Vinayakan) ఇపుడు పాపులర్‌ విలన్‌గా మారిపోయారు. ఫలితంగా ఆయనకు వరుస సినీ అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఆయన చెప్పిన ‘మనసులాయో’ అనే డైలాగ్‌ బాగా ఆదరణ పొందింది. అయితే, ఈ చిత్రంలో నటించినందుకు వినాయకన్‌కు కేవలం రూ.35 లక్షల రెమ్యునరేషన్‌ ఇచ్చినట్టు సమాచారం.

దీనిపై వినాయకన్‌ మాట్లాడుతూ... నేను ‘జైలర్‌’ చిత్రానికి రూ.35 లక్షలు పారితోషికం తీసుకున్నట్టుగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నేను తీసుకున్నట్టుగా సాగుతున్న ప్రచారం కంటే మూడు రెట్లు అధికంగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నాను. నా జీవితంలో అధిక రోజులు కాల్షీట్లు ఇచ్చిన సినిమా ఇదే. ఈ కారణంగా ‘కెప్టెన్‌’ మిల్లర్‌ సినిమాలో ఛాన్స్‌ను కూడా మిస్‌ చేసుకున్నాను. ఇపుడు నాకు వరుస సినీ అవకాశాలు వస్తున్నాయి. వీటిపై త్వరలోనే ప్రకటనలు వస్తాయని వివరించారు. (Vinayakan about His Remuneration)


Vinayakan-2.jpg

‘జైలర్’ (Jailer) విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులను క్రియేట్ చేసింది ‘జైలర్’. ఈ సినిమా కోలీవుడ్‌లో ఉన్న రికార్డులన్నింటిని తుడిచేసి.. మరోసారి రజనీకాంత్ స్టామినా ఏంటో తమిళ చిత్ర పరిశ్రమకి (Kollywood) తెలియజేసింది. ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న తలైవా.. ఈ ఆనందంలో ఇప్పుడు వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రెండు చిత్రాలకు సైన్ చేశారు. అందులో ఒకటి కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కావడం విశేషం.


ఇవి కూడా చదవండి:

============================

*Hanu-Man: గణేష్ చతుర్థి....ఆసక్తికర పోస్టర్‌తో ‘హను-మాన్’ హల్‌చల్

***************************************

*Jithender Reddy: ‘జితేందర్‌ రెడ్డి’ ఎవరో తెలిసేది అప్పుడే..

***************************************

*Klin Kaara: 3 నెల‌ల పాటు అమ్మ‌మ్మగారి ఇంట్లో ఉండి వచ్చిన ‘క్లీంకార’కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం

************************************

*Naga Susheela: కింగ్ నాగార్జున సోదరిపై కేసు నమోదు

************************************

*Chiranjeevi: చిన్ని క్లీంకారతో వినాయక చవితి సెలబ్రేషన్.. పిక్స్ వైరల్

***********************************

Updated Date - 2023-09-19T16:10:30+05:30 IST