The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది

ABN , First Publish Date - 2023-05-28T15:47:04+05:30 IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే నూతన బ్యానర్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌తో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ రూపొందిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’కు సంబంధించిన అనౌన్స్‌మెంట్, మోషన్ వీడియోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది
The India House Still

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి (Vikram Reddy)తో కలిసి ‘V మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అనే బ్యానర్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వినూత్న కథలని రూపొందించడంతో పాటు.. చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంగా ఏర్పడిన ఈ బ్యానర్‌కు సంబంధించి మొట్టమొదటి ఫిల్మ్ ప్రకటన వచ్చేసింది. ‘V మెగా పిక్చర్స్’ తొలి అడుగు ‘ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి నిజ, వాస్తవమైన కంటెంట్‌కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్‌ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ (Abhishek Agarwal Arts)తో కలిసి పడబోతోంది. ఈ అసోసియేషన్‌లో తెరకెక్కబోతోన్న తొలి ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’ (The India House). పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రంలో ప్రతిభావంతులైన నటులు, నైపుణ్యం కలిగిన టెక్నికల్ టీమ్ భాగమయ్యారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ (Ram Vamsi Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth), బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) స్టార్ లైన్-అప్.

మే 28 స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి (Vir Sarvakar Birth Anniversary) సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ‘ది ఇండియా హౌస్’ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పవర్ ప్యాక్డ్ వీడియోని విడుదల చేశారు. ప్రేక్షకులను ఒక కాలానికి తీసుకెళ్లి, వారి హృదయాలను హత్తుకుని కథలో లీనమయ్యేలా ఇండియా హౌస్ సిద్ధమవుతోంది. లండన్‌లో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన నేపథ్యంలో టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. ది ఇండియా హౌస్ చుట్టూ రాజకీయ అలజడి సమయంలో ఒక ప్రేమకథను చూపిస్తోంది. రాబోయే డ్రామాను సూచిస్తూ.. ఇండియా హౌస్ కాలిపోతున్న దృశ్యంతో మోషన్ వీడియో ముగుస్తుంది.

Ram-Charan.jpg

V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన భాగస్వామ్యానికి నాంది పలికాయి. గ్లోబల్ ఫోర్స్‌గా పేరుపొంది, దేశం గర్వించేలా రామ్ చరణ్ మారితే.., అభిషేక్ అగర్వాల్ కంటెంట్ ఆధారిత సినిమాలను నిర్మించాలనే దృక్పథంతో అత్యుత్తమ నిర్మాతలలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సినిమానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ అతి త్వరలోనే రానున్నాయి. (The India House Announcement)

ఇవి కూడా చదవండి:

************************************************

*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?

*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు

*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..

*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!

*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!

Updated Date - 2023-05-28T15:47:04+05:30 IST