Takkar Teaser: సిద్ధార్థ్ రీ ఎంట్రీ.. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో

ABN , First Publish Date - 2023-04-17T20:20:53+05:30 IST

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana), ‘బొమ్మరిల్లు’ (Bommarillu) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ హీరోగా..

Takkar Teaser: సిద్ధార్థ్ రీ ఎంట్రీ.. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో
Takkar Movie Still

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana), ‘బొమ్మరిల్లు’ (Bommarillu) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ (Siddharth). చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts), పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17 సిద్ధార్థ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘టక్కర్’ (Takkar) మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

టీజర్ (Takkar Movie Teaser) విషయానికి వస్తే.. ‘‘రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కినట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ‘నేనంటే ఇష్టం లేదా’, ‘లవ్ అంటేనే ఇష్టంలేదు’ అంటూ హీరోహీరోయిన్ల సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇక టీజర్‌లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. (Siddharth Takkar Movie Teaser Out)

Siddharth.jpg

అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కె. ప్రసన్న (Nivas K Prasanna) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఈ సంవత్సరం మొత్తంగా తన నుంచి 5 సినిమాలు (Siddharth 5 Movies) వస్తాయని సిద్ధార్థ్ తెలిపారు. త్వరలోనే మిగతా చిత్రాల వివరాలను కూడా తెలియజేస్తానని ఆయన తాజాగా ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

Updated Date - 2023-04-17T20:20:54+05:30 IST