Perfume: ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కథతో..

ABN , First Publish Date - 2023-11-17T20:27:35+05:30 IST

స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’ అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి. స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదలకాబోతుండగా.. మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Perfume: ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కథతో..
Perfume Movie Pre Release Event

స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’ (Perfume) అనే చిత్రం రాబోతోంది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్ (CheNag), ప్రాచీ థాకర్ (Prachi Thaker) జంటగా నటించారు. జే.డి. స్వామి (JD Swamy) దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌ను చిత్రయూనిట్ ఘనంగా సత్కరించింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ మురళీ మోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేతి ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ వంటి వారు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో చేనాగ్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం జేడీ నాకు ఈ పర్‌ఫ్యూమ్ ఐడియా చెప్పారు. చాలా మంది దగ్గరకు వెళ్లాం. కానీ కొంత మందికి ఈ కథ అర్థం కాలేదు. చివరకు ఈ క్యారెక్టర్ నేనే చేశాను. రావూరి శ్రీనివాస్, శివ, సుధాకర్, రాజీవ్, రాజేంద్ర అన్న ఇలా అందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. చంద్రబోస్‌గారు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుచిత్రా చంద్రబోస్‌గారి సాయం ఎప్పటికీ మరిచిపోలేను. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డార్క్ మోడ్‌లో నా కారెక్టర్ ఉంటుంది. నాకు మళ్లీ ఇలాంటి ఒక మంచి కారెక్టర్ దొరకదు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ స్వామికి థాంక్స్. నవంబర్ 24న చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండని అన్నారు. డైరెక్టర్ జే.డి. స్వామి మాట్లాడుతూ.. కొత్తదనం, కొత్త పాయింట్‌తో సినిమా చేస్తే కచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుంది. ఆ సుగంధం కచ్చితంగా వ్యాపిస్తుంది. నా గురువు చంద్రబోస్‌గారే నాకు స్పూర్తి. నవంబర్ 24న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూసి ఆశీర్వదించాలని కోరారు. (Perfume Movie Pre Release Event)


లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose) మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా గురించి, నా మీద పాట రాశారు, పాడారు. నాకు బహుమతిగా ఆ పాటను ఇచ్చిన టీంకు థాంక్స్. ఆస్కార్ వచ్చిన ఆ మూమెంట్‌ను మళ్లీ చూడటంతో ఎమోషనల్ అయ్యాను. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నేను రాసిన పాటకు ఎంతో చక్కటి బాణీలను అజయ్ అందించారు. కెమెరామెన్ అద్భుతంగా తీశారు. జేడీ మనసును దర్శించిన నేత్రమే కెమెరామెన్. ఇందులో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసిన నా సతీమణి సుచిత్రకు ఆల్ ది బెస్ట్. ఆచార్య ఆత్రేయ పాటలు, శైలి, రీతి, ప్రవర్తనే నా జీవితంలో పరిమళం. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అవసరాల శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో, హీరోయిన్ ప్రాచీ థాకర్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్, కెమెరామెన్ మహేష్ వంటి వారంతా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

========================

*KR Vijaya: కెఆర్ విజయ @ 60

*****************************

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

Updated Date - 2023-11-17T20:27:36+05:30 IST