Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

ABN , First Publish Date - 2023-11-05T12:20:41+05:30 IST

‘కేజీఎఫ్‌’తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. తాజాగా కాస్త జోరు పెంచి టాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైందీ కన్నడ భామ. క్రేజీ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ఆడిపాడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ అందాలరాశి.. యశ్‌ని జెంటిల్‌మ్యాన్ అని కితాబిచ్చింది. ఇంకా ఆమె తన గురించి చెప్పిన ముచ్చట్లివే..

Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు
KGF Heroine Srinidhi Shetty

‘కేజీఎఫ్‌’తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). తాజాగా కాస్త జోరు పెంచి టాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైందీ కన్నడ భామ. క్రేజీ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో ఆడిపాడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ అందాలరాశి చెబుతున్న కబుర్లివి...

అన్నీ నాన్నే

నా 14వ ఏటే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నాకు అన్నీ నాన్నే. నాకేం కావాలో నాకన్నా ఆయనకే బాగా తెలుసు. చదువు, కెరీర్‌ విషయంలో ఎప్పుడూ నా నిర్ణయానికి నో చెప్పింది లేదు. కాలేజీ రోజుల్లో నేను ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఫొటోలను చూసి తెగ సంబరపడిపోయేవారు. మోడలింగ్‌పై ఆసక్తి ఉందని మొదటగా నాన్నకు చెప్పినప్పుడు నాకన్నా ఎక్కువ ఉత్సాహం చూపారు. మోడలింగ్‌ అంటే కొత్త దుస్తులు ధరించాల్సి వస్తుందని నేను అడగకుండానే షాపింగ్‌ కోసం డబ్బులు పంపించేవారు. అలా అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచారు. (Srinidhi Shetty Interview)

విమర్శలనూ స్వీకరిస్తా

నేను చాలా వేగంగా మాట్లాడుతా. దానివల్ల కొన్ని కొన్ని పదాలు మింగేస్తుంటా. ఒకప్పుడు కొన్ని పదాలు తప్పుగా ఉచ్ఛరించేదాన్ని. దాంతో చాలామంది ఎగతాళి చేసేవారు. మోడలింగ్‌ కోసం ముంబాయిలో అడుగుపెట్టాక, తోటివారు విమర్శించడం మొదలెట్టారు. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని నా ఉచ్ఛారణని మెరుగుపరుచుకున్నా. ఆ క్షణం నుంచి పొగడ్తలని, విమర్శలని సమానంగా స్వీకరించడం మొదలెట్టా.


Srinidhi-3.jpg

యశ్‌ (Yash) జెంటిల్‌మ్యాన్‌

నేను అభిమానించే కథానాయకుల్లో యశ్‌ ఒకరు. కేజీఎఫ్‌లో ఆయనే హీరో అని తెలియగానే ఎగిరి గంతేశా. ఆయనతో ఎప్పుడెప్పుడు స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంటానా అని ఎంతో ఎదురుచూశా. తీరా ఆయన్ని కలవగానే నోట్లో నుంచి మాట రాలేదు. ఖాళీ సమయం దొరికితే సెట్‌లో అందరం సరదాగా క్రికెట్‌ ఆడేవాళ్లం. యశ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. జెంటిల్‌మ్యాన్‌. ఆయన జీవితం నాలాంటి వాళ్లకి స్ఫూర్తిదాయకం. (Srinidhi Shetty about Yash)

అనుకోకుండా ఆఫర్‌

నేను కాలేజీ టాపర్‌ని. చదువు పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. అందుకే వీకెండ్స్‌లో మోడలింగ్‌, ఫ్యాషన్‌ షోలలో పాల్గొనేదాన్ని. రెండూ మేనేజ్‌ చేయడం కష్టంగా మారి, ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పి, మోడలింగ్‌పై దృష్టిసారించా. ‘మిస్‌ కర్ణాటక’, ‘మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌’ వంటి పోటీల్లో గెలిచా. తర్వాత వరుసగా అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నా. ‘మిస్‌ సుప్రానేషనల్‌’ టైటిల్‌ సాధించాక ఒక్కసారిగా నా పేరు మార్మోగిపోయింది. నా ఫొటోలను చూసిన ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నన్ను ఆడిషన్‌కి పిలిచారు. నా నటన నచ్చి వెంటనే ఓకే చేశారు. (Srinidhi Shetty Cine Entry)


Srinidhi-2.jpg

బ్యూటీ సీక్రెట్స్‌

చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. అందుకోసం గులాబీ రేకులు, కలబందతో చేసిన మిశ్రమాన్ని తరచూ వాడుతుంటా. చర్మం పొడిబారకుండా ఉండేందుకు పొద్దున్న, సాయంత్రం మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తా. షూటింగ్స్‌ ఉన్నా, లేకపోయినా వర్కవుట్స్‌ విషయంలో రాజీపడను. ఫిట్‌గా ఉండేందుకు వర్కవుట్స్‌తో పాటు, కచ్చితమైన డైట్‌ పాటిస్తా. షూటింగ్స్‌ లేకపోతే ఫ్రెండ్స్‌తో సరదాగా ఔటింగ్స్‌కి వెళ్తా. (Srinidhi Shetty Beauty Secret)

షారుక్‌ నోట...

నాకు షారుక్‌ ఖాన్‌ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేదాన్ని. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ తప్ప. ‘నువ్వు చిన్నపిల్లవి అలాంటి లవ్‌స్టోరీలు చూడకూడద’ని మావాళ్లు ఆ సినిమా చూడనివ్వలేదు. దాంతో రాత్రంతా ఏడ్చా. కట్‌చేస్తే... 2017 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో షారుక్‌ నోట నా పేరు వినబడింది. ఇక నా ఆనందానికి హద్దుల్లేవు. ఆ కార్యక్రమానికి ఆయనే హోస్ట్‌. షారుక్‌ని అంత దగ్గరగా చూసేసరికి అది కలా? నిజమా? అనుకున్నా. కాసేపటికి తేరుకుని నా ఫ్యాన్‌ మూమెంట్‌ని ఎంజాయ్‌ చేశా. (Srinidhi Shetty about SRK)


Srinidhi-1.jpg

ఇవి కూడా చదవండి:

========================

*Actress: విద్యార్థులపై చేయి చేసుకున్న సినీ నటి అరెస్ట్.. విషయం ఏమిటంటే?

************************************

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

*Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

**********************************

Updated Date - 2023-11-05T12:20:43+05:30 IST