సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..

ABN, First Publish Date - 2023-06-28T12:53:38+05:30

‘స్పై’తో ‘కార్తికేయ 2’ ట్రెండ్‌ని బీట్ చేసి నెక్స్ట్ లెవల్‌కి నిఖిల్ వెళ్తాడని నమ్ముతున్నానని అన్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. జూన్ 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తాజాగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

Nikhil and Naga Chaitanya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కార్తికేయ 2’‌ (Karthikeya 2)తో పాన్ ఇండియా (Pan India) సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ (Nikhil).. మరోసారి ‘స్పై’ (Spy) అనే నేషనల్ థ్రిల్లర్ చిత్రంతో అదే స్థాయి సంచలనానికి సిద్ధమవుతున్నారు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ (Garry BH) దర్శకత్వంలో.. చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె రాజశేఖ‌ర్ రెడ్డి (K. Rajashekhar Reddy) భారీ స్థాయిలో నిర్మించిన చిత్రం ‘స్పై’. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) కథానాయికగా నటించిన ఈ సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ (Nikhil) అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ‌డేస్‌లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి ‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’తో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి.. ‘కార్తికేయ 2’తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు ‘స్పై’తో మరోసారి సెన్సేషన్‌కి సిద్ధమవుతున్నాడు. తన జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ‘స్పై’ జోనర్ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఓటీటీలో ప్రేక్షకులు వరల్డ్ కంటెంట్‌ని చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంటర్ నేషనల్ సినిమాగా అనిపించింది. ఆజాదీ పాట కూడా నాకు బాగా నచ్చింది. (Naga Chaitanya about Nikhil)

చిత్ర నిర్మాతలకు నా అభినందనలు. టెక్నికల్, ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ క్లాస్‌లో వున్నాయి. ఐశ్వర్య మీనన్, సాన్య వెల్ కమ్ టు టాలీవుడ్. ఆర్యన్ రాజేశ్, జిషు, అభినవ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడిగా పరిచయం అవుతున్న గ్యారీకి ఆల్ ది బెస్ట్. ఆయన నుంచి మరిన్ని సినిమాలు రావాలి. నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ‘స్పై’తో ఆ ట్రెండ్‌ని బీట్ చేసి నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాడని నమ్ముతున్నాను. 29న ‘స్పై’ సినిమాని థియేటర్‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు. (Nikhil Starring Spy Movie)

ఇవి కూడా చదవండి:

**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?


**************************************

*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


**************************************

*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?


**************************************

Updated Date - 2023-06-28T12:53:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!