సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bholaa Shankar: రెండు కీలక అప్‌డేట్స్‌తో వచ్చిన మెగాస్టార్

ABN, First Publish Date - 2023-04-27T18:38:07+05:30

2023 క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌లలో ‘భోళా శంకర్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు కీలక అప్‌డేట్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అందులో ఒకటి ఈ సినిమాకు సంబంధించిన..

Megastar Chiranjeevi in Bholaa Shankar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ (Meher Ramesh)ల కాంబినేషన్‌లో రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar). ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2023 క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు కీలక అప్‌డేట్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అందులో ఒకటి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ కాగా.. రెండోది డబ్బింగ్ అప్‌డేట్. ఈ అప్‌డేట్స్‌తో ప్రస్తుతం మెగాస్టార్ ‘భోళా శంకర్’ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Bholaa Shankar Updates)

మొదటి అప్‌డేట్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్న భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ (Huge Interval Sequence Shoot Underway)ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. రెండో అప్‌డేట్ విషయానికి వస్తే.. గురువారం మేకర్స్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను (Dubbing Begins) ప్రారంభించారు. ఈ అప్‌డేట్‌లో జూన్ చివరి నాటికి ‘భోళా శంకర్’ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని కూడా మేకర్స్ వెల్లడించారు.

క్రియేటివ్ కమర్షియల్స్‌ (Creative Commercials)తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మరియు యాక్షన్‌తో పాటు లావిష్‌గా షూట్ చేసిన పాటలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi)ని పూర్తి స్టైలిష్ మాస్ అవతార్‌లో ప్రజంట్ చేస్తున్నారనే విషయం ఇప్పటికే విడుదలైన స్టిల్స్ చూస్తుంటే తెలుస్తోంది. తమన్నా (Tamannaah) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ (Sushanth) ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..

*Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..

*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

Updated Date - 2023-04-27T18:38:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!