సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ivana: ‘సెల్ఫిష్’ చేతికి చిక్కిన ‘లవ్ టుడే’ భామ

ABN, First Publish Date - 2023-04-22T15:35:36+05:30

‘లవ్ టుడే’లో ఆమె.. తన నటనతో యూత్‌ని ఫిదా చేసింది. అలాంటి నటి ఇప్పుడో ‘సెల్ఫిష్’ (Selfish) చేతికి చిక్కింది. చేతికి చిక్కడం అంటే..

Heroine Ivana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల కోలీవుడ్‌ (Kollywood)లో విడుదలై భారీగా కలెక్షన్స్ రాబట్టిన ‘లవ్ టుడే’ (Love Today) చిత్రాన్ని.. సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేమించుకున్న ఇద్దరు యువతీయువకులు వారి ఫోన్‌ని మార్చుకుంటే జరిగే పరిణామాలతో ఈ చిత్రం రూపొందింది. యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ పర్లేదనిపించుకుంది. ఇక సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇవానా (Ivana) ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. ‘లవ్ టుడే’లో ఆమె.. తన నటనతో యూత్‌ని ఫిదా చేసింది. అలాంటి నటి ఇప్పుడో ‘సెల్ఫిష్’ (Selfish) చేతికి చిక్కింది. చేతికి చిక్కడం అంటే.. పెళ్లి చేసేసుకుందని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు కానీ.. ‘సెల్ఫిష్’ అనే టైటిల్‌తో టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

డెబ్యూ మూవీ ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys)తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి (Ashish Reddy), నూతన దర్శకుడు కాశీ విశాల్ (Kasi Vishal) దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’. ఇందులో ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లలో రెక్లెస్ యాటిట్యుడ్ చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్న ఇవానాను చైత్ర (Chaitra) పాత్రలో పరిచయం చేశారు. చైత్రకు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇవానా ఏదో ఆందోళనలో వున్నట్లుగా కనిపించగా.. ఆశిష్ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు.

ఆమె మెడలో ధరించిన ఐడీ కార్డ్ సూచించినట్లుగా ఇవానా ఇందులో ఫైనాన్సియల్ ఎనలిస్ట్‌ (financial analyst)గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోస్టర్‌లో ఇవానా సింపుల్‌గా కనిపించింది. ఆశిష్ గిరజాల జుట్టు, గడ్డంతో మోడిష్‌గా కనిపిస్తున్నాడు. రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. ఈ కథ హైదరాబాద్‌ (Hyderabad)లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి కావడంతో.. ఈ సినిమాకు ‘సెల్ఫిష్’ (Selfish Movie) అనే టైటిల్‌ని పెట్టినట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

*Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది

*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

Updated Date - 2023-04-22T15:35:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!