Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?

ABN , First Publish Date - 2023-04-19T10:43:49+05:30 IST

హీరోయిన్ తాప్సీ సౌత్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు సౌత్ కంటే నార్తే (North Cine Industry) ఇష్టమనేలా ఆమె చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాని..

Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?
Heroine Taapsee Pannu

తాప్సీ.. ఈ పేరు సౌత్ సినీ ప్రేక్షకులకు తెలిసిన పేరే. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు (Tollywood Audience) ఈ భామ బాగా పరిచయమే. 2010లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాదం’ (Jhummandi Naadam) చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీకి తాప్సీ పరిచయమైంది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరో. ఈ సినిమాలో గ్లామర్ షోతో మంచి మార్కులే వేయించుకున్న తాప్సీ పన్ను (Taapsee Pannu).. ఆ తర్వాత వరసబెట్టి సినిమాలు చేసింది. కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ.. ఎడాపెడా సినిమాలు చేస్తూ.. ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేయడంతో.. తాప్సీని వరుస అపజయాలు పలకరించాయి. దాంతో సౌత్ వదిలి నార్త్‌‌పై దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ మాత్రం స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తూ.. సక్సెస్‌ఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సౌత్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు సౌత్ కంటే నార్తే (North Cine Industry) ఇష్టమనేలా ఆమె చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రపంచ సినిమా మాట్లాడుకుంటోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సైతం.. టాలీవుడ్ (Tollywood) హీరోలతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో తాప్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సౌత్ సినిమా ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటే ఇదేనంటూ ఆమెపై సౌత్ సినీ ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హిట్ ఉంటేనే కొన్నాళ్ల పాటు పేరు ఉంటుంది.. లేదంటే ఎవరూ హిట్టులేని వాళ్లని భరించలేరు. తాప్సీ పరిస్థితి కూడా సౌత్‌లో అంతే. ఏదో నాలుగు హిట్స్ బాలీవుడ్‌ (Bollywood)లో పడగానే.. నాకంటే తోపు ఎవరూ లేరిక్కడ అనేలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ.. నెటిజన్లు కూడా ఆమెకు బాగానే చురకలు అంటిస్తున్నారు. అయితే నటన చేర్చుకున్న, నేర్పిన ఇండస్ట్రీపై అలాంటి కామెంట్స్ చేయడం ఏమిటో.. ఆమెకే తెలియాలి. ఇంతకీ తాప్సీ ఏమందంటే..

Pannu.jpg

‘‘సౌత్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలతో నాకు ఎలాంటి గుర్తింపు, స్టార్‌డమ్ రాలేదు. అసలక్కడ నటిగా సంతృప్తి దొరకలేదు. అందుకే బాలీవుడ్ వైపు వచ్చేశాను. అమితాబ్‌గారి ‘పింక్’ (Amitabh Bachchan’s Pink) చిత్రం తర్వాత నా సినీ జీవితం గొప్ప మలుపు తిరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ చేస్తూ చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను చేస్తున్న పాత్రలతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలి.. నా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదన్న స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం’’ అని తాప్సీ చెప్పుకొచ్చింది (Taapsee Pannu Sensational Comments on South Cine Industry). అయితే ఇప్పుడే కాదు.. తాప్సీ గతంలో కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీని, తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరోమారు.. నార్త్‌పై ప్రేమను ఒలకబోస్తూ.. సౌత్‌ని కించపరిచేలా మాట్లాడి.. ఈ భామ సౌత్ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

Updated Date - 2023-04-19T10:43:51+05:30 IST