Madhilo Madhi: ‘మదిలో మది’.. ‘బేబీ’ దర్శకుడు చెప్పిన విడుదల తేదీ

ABN , First Publish Date - 2023-08-01T20:02:37+05:30 IST

ప్రేమ కథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ సినిమా మరోసారి తెలియజేసింది. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడలాంటి మరో చిత్రమే ‘మదిలో మది’ అని అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ని దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా యూనిట్ విడుదల చేసింది.

Madhilo Madhi: ‘మదిలో మది’.. ‘బేబీ’ దర్శకుడు చెప్పిన విడుదల తేదీ
Madhilo Madhi Team with Sai Rajesh

ప్రేమ కథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ సినిమా మరోసారి తెలియజేసింది. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ (Sai Rajesh) తీసిన ‘బేబీ’ (Baby) సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా ‘మదిలో మది’ (Madhilo Madhi) చిత్రం ఉంటుందని అంటున్నారు మేకర్స్. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మదిలో మది’. ప్రకాష్ పల్ల దర్శకత్వంలో ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘బేబీ’ మూవీ దర్శకుడు సాయి రాజేష్ (Baby Director Sai Rajesh) విడుదల చేశారు.


పోస్టర్ విడుదల అనంతరం దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను. మరో గొప్ప సినిమా రాబోతుందని అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌, ‘బలగం’ మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన దర్శకుడు సాయిరాజేష్‌కు చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపింది. (Madhilo Madhi Release Date)


ఇవి కూడా చదవండి:

**************************************

*Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..

**************************************

*Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ

**************************************

*Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..

**************************************

*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

**************************************

Updated Date - 2023-08-01T20:02:37+05:30 IST