కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

ABN, First Publish Date - 2023-08-16T19:46:49+05:30

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల కాగా.. మేకర్స్ గురువారం నాల్గవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ (Kushi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచింది. మంగళవారం మ్యూజిక్ కన్సర్ట్ (Kushi Music Concert) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, సమంతల డ్యాన్స్ అందరినీ అలరించిన విషయం తెలిసిందే. వాళ్ల డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా మేకర్స్ నాల్గవ సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.


మంగళవారం జరిగిన కన్సర్ట్‌లో పాల్గొన్న ఆడియెన్స్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ‘ఖుషి’ నాలుగో పాటను (Kushi 4th Song) వినిపించిన విషయం తెలిసిందే. ‘యెదకి ఒక గాయం’ (Yedhake Oka Gaayam) అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ను ఐదు భాషల్లో గురువారం (ఆగస్ట్ 16) సాయంత్రం 6.03 నిమిషాలకు అధికారికంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమాలో లవ్ పెయిన్ తెలిపే ఎమోషనల్ పాటగా దీన్ని చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు హుషారును నింపితే.. రాబోయే ఈ సాంగ్ మాత్రం.. అందరినీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుందనేలా.. ఇప్పటికే ఈ పాట విన్నవారు చెబుతుండటం విశేషం.

విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ వంటి వారంతా నటించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అటు విజయ్ దేవరకొండ, ఇటు సమంత ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారితో పాటు వారి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

*Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార

***************************************

*Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..

***************************************

Updated Date - 2023-08-16T19:56:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!