Kushi: రెండు రోజులకే 50 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘ఖుషి’..

ABN , First Publish Date - 2023-09-03T15:44:30+05:30 IST

టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటోన్న ‘ఖుషి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజులకే ఈ చిత్రం 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Kushi: రెండు రోజులకే 50 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘ఖుషి’..
Kushi Movie Poster

టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ (Kushi) కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటోన్న ‘ఖుషి’ (Kushi) చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజుకు 51 కోట్ల రూపాయలు ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతూ.. విజయదుంధుబి మోగిస్తోంది. (Kushi 2 Days Collections)


ఒక్క నైజాం ఏరియాలో రెండో రోజున ఖుషి 3.3 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ అంటే.. ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఖుషికి పెరుగుతున్న బుకింగ్స్ మూడో రోజైన సండే కూడా ఇదే జోరు కొనసాగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి జోరు కనిపిస్తోంది. రెండో రోజుకే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించడంతో.. విజయ్ మరియు సమంత ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. (Vijay Deverakonda Kushi Collections)

Kushi-2.jpg

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రాన్ని రూపొందించారు. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని మేకర్స్ చెబుతున్నారు. కలెక్షన్స్ చూస్తుంటే మరికొద్ది రోజుల పాటు ఖుషి జోరు ఇలాగే కొనసాగుతుందనేలా.. వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

*Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

***********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

*RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు

************************************

Updated Date - 2023-09-03T15:48:22+05:30 IST