సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

ABN, First Publish Date - 2023-04-24T15:37:25+05:30

అఖిల్ ఎనర్జీ మీరు ఇప్పుడు చుస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొట్టలో ఉన్నప్పుడే..

Akhil and Nagarjuna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy)ల క్రేజీ కాంబినేషన్‌లో.. స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఏజెంట్’ (Agent) చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments), సురేందర్ 2 సినిమా (Surender 2 Cinema) పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం చిత్రయూనిట్ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా వరంగల్‌లో ఈ చిత్ర మాసీవ్ ప్రీ రిలీజ్ వేడుకని (Agent Pre Release Event) మేకర్స్ నిర్వహించారు. అగ్ర హీరో కింగ్ నాగార్జున‌ (King Nagarjuna)తో పాటు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో కింగ్ అక్కినేని నాగార్జున (King Nagarjuna Speech at Agent Pre Release Event) మాట్లాడుతూ... ‘‘వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు.. వైల్డ్ వరంగల్. మా అందరికీ మీరంటే (వరంగల్ ప్రజలను ఉద్దేశించి) పిచ్చి. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు.. సినిమాలంటే ప్రేమ చూపిస్తారు. ఒక కొత్త జానర్‌తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి అదే కొత్త జానర్‌తో ఒక చక్కటి సినిమా, థ్రిల్లింగ్ సినిమా, స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడలేదు, కథ వినలేదు. కానీ అఖిల్ ఇంట్లో చెబుతుంటే వినేవాడిని. బ్లాక్‌బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. సురేందర్ రెడ్డి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ తీశారు. అలాగే అనిల్ సుంకర‌గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. అందరూ స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి చాలా మంచి భవిష్యత్ వుండాలి. సూపర్ స్టార్ మమ్ముట్టిగారు కథ అంగీకరించారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్‌కి పెద్ద హిట్ అవుతుందని ఆనందపడ్డాను. ఇటీవలే మమ్ముట్టి గారి మాతృమూర్తి ఫాతిమాగారు కన్నుమూశారు. ఫాతిమాగారి ఆత్మకి శాంతి చేకూరాలి. మమ్ముట్టి గారు ఎంత అంకితభావం కలిగిన నటుడు అంటే.. ఇంత కష్టకాలంలో కూడా డబ్బింగ్ ఫినిష్ చేసి విడుదలకు రెడీ చేశారు. వారికి కృతజ్ఞతలు.

ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి (నవ్వుతూ) (King Nagarjuna about Ayyagaru Akhil).. వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చుస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర వున్నప్పుడు రెస్ట్ లెస్‌గా పరిగెత్తేవాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎనర్జీ వుంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఎందుకు అవుతుందీ అంటే.. మా అక్కినేని అభిమానులు, మీరు చూపిస్తున్న ప్రేమ. మా ప్రతిభ, కష్టం ఉండొచ్చు.. కానీ ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్‌బస్టర్ (BlockBuster) అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనిపిస్తుంది. ఈ వేడుకకు వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Hari Hara Veera Mallu: కీరవాణి కూడా..!

*Akhil Akkineni: ‘ఏజెంట్’లో అది నాకు చాలా కష్టమనిపించింది

*Dhanush: 40 ఏళ్ల వయసులో యూత్‌ ఐకాన్‌ అవార్డు

*Mama Mascheendra Teaser Talk: మహేష్ బావ.. ఆ ఇద్దర్నీ ఒకేసారి చంపేస్తాడట!

*OG Producer: మటన్ బిర్యానీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేసిన నిర్మాత

*Young Actress: మోడల్స్‌ని వ్యభిచార ఊబిలోకి దించుతోన్న నటి అరెస్ట్

Updated Date - 2023-04-24T15:37:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!