Jorugaa Husharugaa: బుచ్చిబాబు సానా వదిలిన ట్రైలర్

ABN , First Publish Date - 2023-12-06T19:45:52+05:30 IST

‘బేబి’ చిత్రంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ హీరో విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అను ప్ర‌సాద్ దర్శకత్వంలో శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు.

Jorugaa Husharugaa: బుచ్చిబాబు సానా వదిలిన ట్రైలర్
Jorugaa Husharugaa Trailer Launch

‘బేబి’ చిత్రంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ హీరో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’ (Jorugaa Husharugaa). పూజిత పొన్నాడ (Poojitha Ponnada) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అను ప్ర‌సాద్ (Anu Prasad) దర్శకత్వంలో శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల (Nireesh Tiruvidhula) నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రు 15న విడుద‌ల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా (Buchibabu Sana) మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమాతో విరాజ్ అశ్విన్ నటుడిగా మంచి గుర్తింపును పొందారు. విరాజ్, పూజిత కలిసి నటించిన ఈ ‘జోరుగా హుషారుగా’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ.. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.


Buchi-Babu.jpg

చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. చిత్ర ట్రైలర్‌ బుచ్చిబాబు‌గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేయబోతున్న చిత్రానికి మా టీమ్ తరపున ఆల్ ద బెస్ట్ చెబుతున్నాము. ‘జోరుగా హుషారుగా’ సినిమాలో అంద‌ర్ని ఆక‌ట్టుకునే వినోదం వుంది. చిత్రం చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఓ మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి స‌హ‌కారంతో చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్నామని అన్నారు. కొత్తద‌నం ఆశించే ప్ర‌తి ఒక్క‌రికి మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మకం వుందని అన్నారు చిత్ర దర్శకుడు అను ప్రసాద్. (Jorugaa Husharugaa Trailer Released)


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్

**********************************

*B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?

**************************************

*Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

****************************************

Updated Date - 2023-12-06T19:45:53+05:30 IST