Rudrangi Teaser: మరీ ఇంత క్రూరంగానా..?

ABN , First Publish Date - 2023-04-16T20:07:54+05:30 IST

జగపతి బాబు (Jagapathi Babu), ఆశిష్ గాంధీ (Ashish Gandhi), మమతా మోహన్ దాస్ (Mamta Mohan Das), విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రుద్రంగి’ టీజర్ ఎలా ఉందంటే..

Rudrangi Teaser: మరీ ఇంత క్రూరంగానా..?
Jagapathi Babu in Rudrangi Movie

జగపతి బాబు (Jagapathi Babu), ఆశిష్ గాంధీ (Ashish Gandhi), మమతా మోహన్ దాస్ (Mamta Mohan Das), విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’ (Rudrangi). ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రమిది. బాహుబలి (Bahubali), ఆర్.ఆర్.ఆర్ (RRR) చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ (Ajay Samrat) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ వదిలిన అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పోస్టర్స్ మాదిరిగానే.. ఈ టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. (Rudrangi Official Teaser Out)

టీజర్ విషయానికి వస్తే..(Rudrangi Teaser Report) స్వాతంత్ర్యం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం కనిపిస్తోంది. జగపతి బాబు భీం రావు దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో కనిపిస్తున్నారు. స్వాతంత్ర్యం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడు కావొచ్చు కానీ నేను భగవంతుడిని అనే మాటల ద్వారా జగపతి బాబు పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో.., నాటి తెలంగాణలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాంటి దొరకు మల్లేష్ అనే కుర్రాడు ఎదురు తిరిగితే అతన్ని ఏం చేశారు అనే కోణంతో పాటు.. అనేక వాస్తవ ఘటనలను తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలోని ప్రతి పాత్రకు ఒక ఐడెంటిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా జగపతి బాబు పాత్ర ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయనిదిగా.. సరికొత్తగా ఉంది. ఆయన ఆహార్యం, వాచకంలోనే క్రూరత్వం కనిపిస్తోంది. ఇక జ్వాలాబాయి దేశ్ ముఖ్‌గా మమతా మోహన్ దాస్ కూడా జగపతి బాబు పాత్రకు తీసినిపోని విధంగా అహంకారంతో కనిపిస్తోంది. మల్లేష్‌గా ఆశిష్ గాంధీకి మంచి పాత్ర వచ్చినట్టుగా ఉంది. టేకింగ్, మేకింగ్ పరంగా చాలా క్వాలిటీతో ఈ సినిమాని రూపొందించారనేది తెలుస్తుంది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబిచేలా ఆర్ట్ వర్క్ ఉంది. మొత్తంగా సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూసేలా చేయడంతో ఈ టీజర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. (Rudrangi Movie)

Rudrangi.jpg

రసమయి ఫిలిమ్స్ (Rasamayi Films) బ్యానర్ నుంచి భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా.. నాఫల్ రాజా ఏఐఎస్పి (nofel raja) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

*Rakul Preet Singh: రకుల్‌ రీ ఎంట్రీ సాధ్యమేనా?

*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

Updated Date - 2023-04-16T20:07:55+05:30 IST