Hide n Seek: సుధీర్ వర్మ సపోర్ట్‌తో ‘హైడ్ అండ్ సీక్’ ఆటకు సిద్ధమైన విశ్వంత్

ABN , First Publish Date - 2023-06-11T11:59:59+05:30 IST

సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘హైడ్ అండ్ సీక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ లోగోని శనివారం దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Hide n Seek: సుధీర్ వర్మ సపోర్ట్‌తో ‘హైడ్ అండ్ సీక్’ ఆటకు సిద్ధమైన విశ్వంత్
Hide n Seek Movie Launch Still

సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sahasra Entertainments) బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతోన్న చిత్రం ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టైటిల్ లుక్ పోస్టర్‌ని దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘హైడ్ అండ్ సీక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విశ్వంత్ (Viswanth) హీరోగా.. శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేసిన ఈ టైటిల్ లోగో చూస్తుంటే.. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా అర్థమవుతోంది. గన్‌లో వాడే బుల్లెట్స్, సిరంజ్, లాక్స్, ఆయుధాలు అన్ని మిక్స్ చేసి డిజైన్ చేసిన ఈ టైటిల్ ఆసక్తికరంగా ఉంది. ఆట ఎలా ఉండబోతోందో? అనే క్యూరియాసిటీని కలిగిస్తోంది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. (Hide n Seek Movie)

Hide-n-Seek.jpg

సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విధంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. సాక్షి రంగారావు కుమారుడు సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి చిన్న రామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. లిజో కె జోష్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

* Matti Katha: ‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

**************************************************************

*Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ

*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

Updated Date - 2023-06-11T11:59:59+05:30 IST