కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tiragabadara Saami Teaser: జై బాలయ్య.. బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..

ABN, First Publish Date - 2023-08-28T16:42:47+05:30

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Tiragabadara Saami Movie Hero and Heroine

యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా.. ఎఎస్ రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdary) దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తిరగబడరసామీ’ (Tiragabadara Saami). సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్‌లో ఓ వైవిధ్యభరిత చిత్రంగా ఉండబోతుందనేది అర్థమవుతోంది.


టీజర్ విషయానికి వస్తే.. హీరో రాజ్ తరుణ్ ఇందులో హింసకు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి మాత్రం ఆ హింసంటేనే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని మలిచినట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. అందమైన ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ టీజర్‌లో చూపించారు. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్‌గా కనిపించారు. హీరోయిన్‌గా నటించిన మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) అందంగా కనిపించింది. తను ఇందులో కొన్ని స్టంట్స్ కూడా చేసింది. మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించడం ఆసక్తికరం. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. జెబి సంగీతం హైలెట్ అనేలా ఉంది. మొత్తంగా అయితే నందమూరి అభిమానులకు ఈ సినిమా పండగే అనే చెప్పుకోవచ్చే. చివరిలో జై బాలయ్య అంటూ టీజర్‌ను ముగించిన తీరు కూడా.. బాలయ్య ఫ్యాన్స్‌గా బాగా కనెక్ట్ అవుతుంది. (Tiragabadara Saami Teaser Talk)


ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘‘ఏఎస్ రవికుమార్ చౌదరి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి హిట్ చిత్రాలని అందించిన మా దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్ ‘ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా’ లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ ఎక్స్‌ట్రార్దినరీ ఆర్టిస్ట్. ఈ టీజర్ చూస్తుంటే అండర్ ప్లే పాత్ర చేసి ఫైనల్‌గా తిరగబడరసామీ అని క్లైమాక్స్‌లో ఇరగదీసినట్లు అర్థమౌతుంది. ఎంటర్‌టైమెంట్ సినిమా అనుకున్నాను. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా వుంది. రాజ్ తరుణ్, రవి కుమార్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ఇది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ (Raj Tharun) మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు రవికుమార్ చౌదరి ఈ సినిమాతో నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్ పెద్దగా ఎపుడూ చేయలేదు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కూడా అడిగాను. ఇంతసేపు సైలెంట్‌గా వున్నావ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి పేలాల్సిందే అని చెప్పారు( నవ్వుతూ). సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం. దయచేసి అందరూ థియేటర్స్‌లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

*****************************************

*AskSRK: ‘జవాన్’.. మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన బాలీవుడ్ కింగ్ ఖాన్

*****************************************

*Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి

*****************************************

*Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

*****************************************

Updated Date - 2023-08-28T16:42:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!