Thandel: సముద్రం మధ్యలో.. చైతూ ‘తండేల్’ అప్‌డేట్

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:47 PM

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘తండేల్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సముద్రం మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Thandel: సముద్రం మధ్యలో.. చైతూ ‘తండేల్’ అప్‌డేట్
Thandel Movie Still

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti), ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts).. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘తండేల్’ (Thandel) రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్నిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ లెన్తీ షెడ్యూల్‌లో టీమ్ కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్స్‌ని షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ షూటింగ్‌కి సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్‌ని వదిలారు.

ప్రస్తుతం సముద్రం మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. టీమ్ షేర్ చేసిన ఈ ఫొటోలో నాగ చైతన్య సముద్రం వైపు నడుస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు. మేకర్స్ త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కంప్లీట్ మేకోవర్‌ అయిన నాగ చైతన్య ఈ సినిమాలో మునుపెన్నడూ లేని గెటప్‌లో కనిపించనున్నారు. షూట్ ప్రారంభించడానికి ముందు దర్శకుడు చందూ మొండేటితో కలిసి ఇంటెన్స్ ట్రైనింగ్, హోంవర్క్ చేసిన విషయం తెలిసిందే. (Thandel Shooting Update)


Naga-Chaitanya.jpg

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ. అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన సౌండ్‌ ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. షామ్‌ దత్ కెమెరామ్యాన్‌గా పని చేస్తుండగా.. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Suhas: సుహాస్ ‘మ్యారేజి బ్యాండు’‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

********************************

*Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాలపై సుహాసిని హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

********************************

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

Updated Date - Dec 26 , 2023 | 03:47 PM