Suhas: సుహాస్ ‘మ్యారేజి బ్యాండు’‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:42 PM

సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కు రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు.

Suhas: సుహాస్ ‘మ్యారేజి బ్యాండు’‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
Suhas In Ambajipeta Marriage Band

సుహాస్ (Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)కు రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 2న (Ambajipeta Marriage Band Release Date) గ్రాండ్‌గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన పిక్‌ని మేకర్స్ వదిలారు. ఈ పిక్‌లో గుండుతో ఉన్న సుహాస్.. అద్ధం ముందు నిలబడినట్లుగా చూపించారు. అయితే అద్దంలో మాత్రం జుట్టుతో ఉన్నట్లుగా కనిపిస్తుండటం చూస్తుంటే.. ఇదే సినిమాకు కీ పాయింట్ అనేది అర్థమవుతోంది. వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన ఈ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా థియేటర్స్‌లో ఆడియెన్స్‌కు యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.


Suhas-Full.jpg

సుహాస్ (Hero Suhas) విషయానికి వస్తే.. కమెడియన్‌గా, హీరో పక్కన చిన్న చిన్న పాత్రలతో మొదలెట్టి.. ఈ రోజు హీరోగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ‘కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమాలు నటుడిగా సుహాస్‌కు మంచి గుర్తింపునిచ్చాయి. ఆ తర్వాత కేవలం హీరోగా అని మాత్రమే కాకుండా.. తనకు నచ్చిన ఇతర పాత్రలు కూడా చేసుకుంటూ.. హీరోగా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాబోయే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకువస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సుహాస్.


ఇవి కూడా చదవండి:

====================

*Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాలపై సుహాసిని హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

********************************

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

Updated Date - Dec 26 , 2023 | 02:42 PM