HITMAN Chapter 1: పవన్ కళ్యాణ్ నిర్మాత వదిలిన ‘హిట్ మ్యాన్’ టీజర్

ABN , First Publish Date - 2023-09-06T20:42:00+05:30 IST

99 సినిమాస్ బ్యానర్‌పై బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’. నవంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ను ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

HITMAN Chapter 1: పవన్ కళ్యాణ్ నిర్మాత వదిలిన ‘హిట్ మ్యాన్’ టీజర్
HITMAN Chapter 1 Teaser Launch

99 సినిమాస్ బ్యానర్‌పై బిష్ణు అధికారి (Bishnu Adhikari), అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’ (HITMAN). నవంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌ను ‘హరిహర వీరమల్లు’ (HHVM) నిర్మాత ఎ.ఎం.రత్నం (AM Rathnam) విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. ‘‘గాయాలతో బాధపడుతున్న హీరో అద్దంలో తనని తాను చూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మనసులో దేని గురించో బాధపడుతుంటాడు. కానీ దాన్ని బయటకు కనిపించనీయడు. ఆ తర్వాత స్టైలిష్‌గా తయారై తన గదిలోకి వెళతాడు. అక్కడున్న ఆయుధాల్లో విల్లుని ఎంపిక చేసుకుని.. వెనక్కి చూసి లక్ష్యాన్ని గురి పెట్టి చేదిస్తాడు. ఇంతకీ హీరో దేని కోసం అంతలా ఆలోచిస్తుంటాడు.. తన లక్ష్యం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే నవంబర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాని చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. (HITMAN Teaser)


ఈ టీజర్ విడుదల సందర్భంగా హీరో, డైరెక్టర్ బిష్ణు అధికారి మాట్లాడుతూ (Bishnu Adhikari about HITMAN).. ‘హిట్ మ్యాన్’ ఒక స్పై థ్రిల్లర్. దీనికి స్క్రిప్ట్ నేనే రాసి డైరెక్ట్ చేయటంతో పాటు హీరోగానూ నటించాను. న్యూ ఏజ్ మూవీ. బూర్జ్ ఖలీఫాలో సినిమా షూటింగ్ చేశాం. పారిస్, దుబాయ్, నేపాల్, శ్రీలంక, భారత్.. ఇలా వేరు వేరు దేశాల్లో సినిమాను చిత్రీకరించాం. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. ఛాప్టర్ 1 నవంబర్‌లో రిలీజ్ కానుంది. నేను మార్వల్ సినిమాలకు పెద్ద అభిమానిని. అదే స్టైల్లో కొత్తగా ఓ స్పై థ్రిల్లర్ కథను చెప్పటానికి ప్రయత్నించాను. రాంబో సినిమా తర్వాత విల్లు, బాణాలతో కూడిన యాక్షన్ మూవీ మరోటి రాలేదు. కానీ ఈ సినిమాలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ఛాప్టర్ 1కి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మంచి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్వీస్ టెక్నాలజీ ఉన్నట్లు ఈ సినిమాలో ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హిందీలోనూ రిలీజ్ చేయటానికి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి, రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా.. బిష్ణు అధికారి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Narayana and Co: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

*************************************

*Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

*************************************

*Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

*************************************

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

*MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్

*************************************

Updated Date - 2023-09-06T20:43:57+05:30 IST