MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్

ABN , First Publish Date - 2023-09-05T20:33:12+05:30 IST

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి (స్వీటీ). ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్’ ప్రారంభించింది. ఫస్ట్ ప్రభాస్‌కు ఛాలెంజ్ విసరగా.. ప్రభాస్ ఈ ఛాలెంజ్ స్వీకరించి తనకి ఇష్టమైన రెసిపీని షేర్ చేసి.. అనంతరం రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరారు.

MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్
Anushka, Prabhas and Ram Charan

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mister Polishetty) ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి (స్వీటీ). ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్’ (MSMP Recipe Challenge) ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అనుష్క (Anushka Shetty) విసిరింది.


రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫుడ్ లవర్ అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఇష్టంగా తినడమే కాదు.. తన కో స్టార్స్‌కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటారు. అందుకే ఫస్ట్ ప్రభాస్‌కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరినట్లు అనుష్క తెలిపింది. అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్‌ను ప్రభాస్ స్వీకరించారు. సోషల్ మీడియా ద్వారా తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ.. దానిని ఎలా తయారు చేయాలో వివరించారు. ఎంతోకాలంగా అనుష్క‌తో తనకు పరిచయం ఉన్నా ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసిందని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతే కాదండోయ్.. ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను తన స్నేహితుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan)కు విసిరారు ప్రభాస్. మరి రామ్ చరణ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి.. తనకు ఇష్టమైన ఫుడ్ ఏమిటనేది తెలియజేయడమే కాకుండా.. దానిని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలపాల్సి ఉంది.

Anushka.jpg

ఇక ప్రభాస్, అనుష్క విషయానికి వస్తే.. వీరిద్దరూ సూపర్ హిట్ పెయిర్‌గా పేరుగాంచారు. ‘బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2’ చిత్రాల్లో కలిసి నటించి ఆడియెన్స్ ఫేవరేట్ జోడీ అయ్యారు. ఈ స్నేహంతో అనుష్క హీరోయిన్‌గా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రమోషన్‌కు (Miss Shetty Mr Polishetty Movie Promotions) ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులను కూడా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకోవాలని కోరింది. వాళ్లు తమకు నచ్చిన రెసిపీని, వాటిని తయారుచేసే పద్ధతిని పోస్ట్ చేయాలని చెప్పింది. ఈ ఛాలెంజ్ ను తమ ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేయమని అనుష్క కోరింది. కాగా.. న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ (UV Creations) బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి (Mahesh Babu P) ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది.

Prabhas.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Balagam: ‘బలగం’ పెద్దమనిషి ఇక లేరు..

************************************

*Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి

*************************************

*Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!

*************************************

Updated Date - 2023-09-05T20:33:12+05:30 IST