Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది

ABN , First Publish Date - 2023-06-07T17:52:31+05:30 IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్, బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది
Mega Prince Varun Tej In Gandheevadhari Arjuna Film

డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ (Mega Prince Varun Tej), టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna). స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇన్‌టెన్స్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌.. అందులో వ‌రుణ్ తేజ్ లుక్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన బీటీఎస్ వీడియో గ్లింప్స్‌కు ప్రేక్షకులని ఆకర్షించి.. సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ ‘గాంఢీవధారి అర్జున’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న (Gandheevadhari Arjuna Release Date) భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్ర విడుదల తేదీని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో మెగా ప్రిన్స్ మస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో వైపు నిర్మాణానంతర కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసే పనిలో కూడా యూనిట్ నిమగ్నమై ఉంది.

Varun.jpg

వ‌రుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం యాక్ష‌న్ సీక్వెన్సెస్ టెక్నిక‌ల్ హై స్టాండ‌ర్డ్స్‌తో రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర (SVCC) బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్, బాపినీడు (BVSN Prasad and Bapineedu) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయ‌ర్ (Mickey J Meyer) సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!

*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్‌ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం

Updated Date - 2023-06-07T17:52:31+05:30 IST