సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Arvind Swami: ‘కస్టడీ’.. అరవింద్ స్వామి లుక్ అదిరింది

ABN, First Publish Date - 2023-03-02T20:53:13+05:30

అక్కినేని నాగ‌ చైతన్య (Akkineni Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు

Arvind Swami in Custody
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగ‌ చైతన్య (Akkineni Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల చిన్న గ్లింప్స్‌ను వదిలిన విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) పాత్రకు సంబంధించి వచ్చిన పోస్టర్ కూడా క్యురియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్రంలోని ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి (Arvind Swamy) పాత్ర పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్రలో అరవింద్ స్వామి లుక్ అదిరిపోయేలా ఉందంటూ అప్పుడే టాక్ మొదలైంది.

ఈ పోస్టర్‌లో అరవింద్ స్వామి లుక్ చాలా పవర్ ఫుల్‌గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర చేస్తున్నారనేది ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో పాటు మరో పిక్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఇందులో ఒక గ్రూపుకి నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారు. ఈ ఫెరోషియస్ లుక్స్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి. చైతూ సరసన మరోసారి కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి ప్రియమణి (Priyamani) మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. 12 మే, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!


Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-02T21:28:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!