Custody: పరుగులు పెట్టిస్తోన్న అక్కినేని హీరో..

ABN , First Publish Date - 2023-03-06T18:35:19+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటివలే..

Custody: పరుగులు పెట్టిస్తోన్న అక్కినేని హీరో..
Hero Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది (Custody). తాజాగా ‘కస్టడీ’ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లుగా మేకర్స్ ఓ ఫొటోను విడుదల చేశారు. ఈ పిక్‌లో హీరో నాగచైతన్య డబ్బింగ్ చెబుతున్నారు (Naga Chaitanya in Custody Dubbing). ఈ పిక్ చూస్తుంటే.. నాగచైతన్య ఈ మూవీని పరుగులు పెట్టిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకిప్పుడు అర్జెంట్‌గా హిట్ కావాలి. రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఆయన ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

‘నాగ చైతన్య డబ్బింగ్ మొదలుపెట్టారు. త్వరలోనే ఎక్సయిటింగ్ టీజర్ అప్డేట్’ అని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ పిక్‌లో నాగచైతన్య తీక్షణంగా చూస్తూ.. డబ్బింగ్ చెబుతున్నారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి (Arvind Swami) విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌ని రీసెంట్‌గానే మేకర్స్ రివీల్ చేశారు. అలాగే సీనియర్ నటి ప్రియమణి (Priyamani) కూడా ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇంకా ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. ఇప్పటికే విడుదలైన ‘కస్టడీ’ ప్రమోషనల్ కంటెంట్‌ మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే. భారీ తారాగణమే కాకుండా.. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ (Pavan Kumar) సమర్పిస్తుండగా.. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తున్నారు. 12 మే, 2023న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

Updated Date - 2023-03-06T19:02:03+05:30 IST