Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్మాన్‌ మూవీలో గ్లోబల్ స్టార్.. లుంగీ ఎత్తి కడితే పూనకాలే..

ABN, First Publish Date - 2023-04-04T13:51:14+05:30

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబాలకు చాలాకాలంగా సత్సంధాలు ఉన్న విషయం తెలిసిందే.

Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్మాన్‌ మూవీలో గ్లోబల్ స్టార్.. లుంగీ ఎత్తి కడితే పూనకాలే..
Ram Charan in Bollywood
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబాలకు చాలాకాలంగా సత్సంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే చిరంజీవి హీరోగా నటించిన ‘గాఢ్ ఫాదర్’లో సల్మాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. అది కూడా ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడు. దీంతో సల్మాన్ నటించే ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) మూవీలో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. పూజా హేగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ (Venkatesh) ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ తరుణంలోనే ఈ మూవీలోని ‘ఏంటమ్మా’ (Yentamma) పాటకి సంబంధించిన టీజర్‌ని ఏప్రిల్ 4న విడుదల చేశారు. అందులో.. సల్మాన్, వెంకీ లుంగీలో ఉండి.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా.. ఓ వ్యక్తి పైకి వెళ్లడం వెనుక నుంచి చూపించారు.

దీంతో అది రామ్‌చరణ్‌ (Ram Charan)నే అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే.. అందరూ అనుకున్నదే నిజమైంది. అది గ్లోబల్ స్టార్ రామ్ ‌చరణ్‌నే. ఈ పూర్తి సాంగ్ మూవీ టీం తాజాగా విడుదల చేసింది. అది ‘ఏంటమ్మా’ అంటూ తెలుగు లిరిక్‌తో ప్రారంభమవ్వడం విశేషం. అలాగే.. కొన్ని చోట్ల ‘ఈ రోజు వేడుకలా ఉంటుంది.. ఉంటుంది. నాచేంగే ఊటకర్కే లుంగీ (లుంగీని ఎత్తికట్టి డ్యాన్స్ చేస్తే)’ అని ఉంది. దీంతో బాలీవుడ్ మూవీలో తెలుగు లిరిక్ రావడం, తెలుగు స్టార్స్ అందులో నటించడంతో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో #KisiKaBhaiKisiKiJaan, #Yentamma, #SalmanKhan #Ramcharan యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Ram-charan.jpg

‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లోని ‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ తెలుగు సినీ అభిమానులకు స్పెషల్ ట్రీట్‌ అనే చెప్పాలి. ఒకేసారి ముగ్గురు స్టార్లు కాలు కదపడంతో ఈ పాటను చూసి, మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్‌చరణ్ స్టైలిష్ ఎంట్రీ అదిరిపోయింది. విడుదల తర్వాత పెద్ద తెరపై ఈ పాట కచ్చితంగా ఆకట్టుకుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’కి ఇది రిమేక్ అని సమాచారం.

ఇవి కూడా చదవండి:

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-04T14:01:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!