Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

ABN , First Publish Date - 2023-04-02T17:04:15+05:30 IST

ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) ‘నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌’(ఎన్‌ఎంఏసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో
Varun Dhawan

ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) ‘నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌’(ఎన్‌ఎంఏసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అది తనన కలల ప్రాజెక్ట్ అని నీతా పలుమార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అనుకున్నట్లుగానే చాలా గ్రాండ్‌గా ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆ కల్చరల్‌ సెంటర్‌ని ప్రారంభిచారు. ఈ వేడుకకకి బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. అలాగే పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. హాలీవుడ్ నుంచి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఫేమ్ టామ్ హోలండ్, జెండయాతో పాటు బాలీవుడ్ నుంచి ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, రష్మికా మందన్నా, వరుణ్ ధావన్ ఉన్నారు. (NMACC Launching Event)

ఈ సెలబ్రిటీల్లో చాలా మంది స్టేజ్ మీద డ్యాన్స్ వేసి అలరించారు. ముఖ్యంగా ఆలియాతో కలిసి రష్మిక ‘నాటు నాటు’ పాటకి స్టెప్పులు వేశారు. ఆ ఫర్ఫామెన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అయితే.. ఈ తరుణంలోనే బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) చేసిన ఓ పని ఆయనపై విమర్శలకి కారణమైంది. ఫర్పామెన్స్ ఇచ్చిన వరుణ్ కిందకి వచ్చి అక్కడే ఉన్న ప్రముఖ మోడల్ గిగి హ్యాడిడ్‌ (Gigi Hadid)ను ఎత్తుకుని స్టేజ్‌పైకి తీసుకెళ్లి.. తిప్పాడు. అనంతరం గిగి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో .. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు హీరో వైఖరి తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ‘గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది’, ‘వరుణ్ అలా చేయకుండా ఉండాల్సింది’, ‘బాలీవుడ్‌కు ఏమవుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు’ అని ట్రోలింగ్ చేస్తున్నారు.

Varun-Dhawan-1.jpg

దీనిపై తాజాగా వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘మిమ్మల్ని ఈ రోజు మేల్కొపాలనుకుంటున్నాను. మీ తప్పుడు ఆలోచనలని బద్దలు కొట్టాలని అనుకుంటున్నా. గిగిని స్టేజీపైకి తీసుకెళ్లి ముద్దుపెట్టుకోవడం ముందే ప్లాన్ చేశారు. కాబట్టి ఈ అనవరసరైన విషయాల గురించి చర్చ మానేసి వేరే పని చూసుకోండి’ అని రాసుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Updated Date - 2023-04-02T17:05:10+05:30 IST