Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..

ABN , First Publish Date - 2023-05-08T19:37:46+05:30 IST

‘జవాన్’ విడుదల తేదీ ప్రకటనను పురస్కరించుకుని కూడా.. ట్విట్టర్‌లో ‘ఆస్క్ ఎస్‌ఆర్‌కె’ (Ask SRK) అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ముచ్చటించారు. ఈ చాట్‌లో షారుఖ్‌ ‘జవాన్‌’ సినిమా గురించి

Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..
Shah Rukh Khan and Atlee

‘పఠాన్‌’ సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయిన జోష్‌లో ఉన్నారు షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan). అదే జోరులో యాక్షన్‌ ప్యాక్డ్ ‘జవాన్‌’ (Jawan) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మాస్‌ ఆడియన్స్ పల్స్ పక్కాగా తెలిసిన డైరక్టర్‌ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘పఠాన్’ (Pathaan) టైమ్‌లో షారుఖ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. అభిమానులతో వీలైనన్ని సార్లు చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పుడు ‘జవాన్’ విడుదల తేదీ ప్రకటనను పురస్కరించుకుని కూడా.. ట్విట్టర్‌లో ‘ఆస్క్ ఎస్‌ఆర్‌కె’ (Ask SRK) అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో ముచ్చటించారు. ఈ చాట్‌లో షారుఖ్‌ ‘జవాన్‌’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘జవాన్‌’ విడుదల తేదీ వాయిదా పడటం గురించి షారుఖ్‌ స్పందిస్తూ.. ‘‘ప్రేక్షకుల మనసుకు నచ్చేలా, వారికి అద్భుతమైన వినోదాన్ని అందించేలా సినిమా చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కొన్నిసార్లు వేచి ఉండటం వల్ల కూడా అద్భుతాలను ఆస్వాదించవచ్చు. జవాన్‌ కోసం అందరూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. హద్దులు దాటి అహర్నిశలూ కృషి చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయడం వల్ల ఇంకాస్త వెసులుబాటుతో పనిచేస్తారు’’ అని అన్నారు. (SRK Chit Chat with Fans)

‘జవాన్‌’లో తనకు నచ్చిన అంశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు ఇది సరికొత్త జోనర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే అట్లీ స్పెషల్‌. రెండు వైవిధ్యమైన బాణీలను కలిపి జతచేసి పరుగులు తీయించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లీ, అతని టీమ్‌ చాలా మాస్‌గా ఉన్నారు. ఆ మాస్‌ నాకు నచ్చింది’’ అని చెప్పారు. (Shah Rukh about Jawan)

Shah-Rukh-Khan.jpg

పోస్టర్‌లో షారుఖ్‌ ఎందుకు లేరు? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు కింగ్‌ ఖాన్‌. ‘‘నా పోస్టర్‌ కాదు, నా పేరు చాలని ఫిక్సయ్యారు మేకర్స్’’ అని అన్నారు. సహ నటుల గురించి మాట్లాడుతూ ‘‘నయనతార (Nayanthara) లవ్లీ పర్సన్‌. చాలా స్వీట్‌. ఆమెతో పనిచేయడం చాలా మంచి అనుభూతి. ప్లెజర్‌’’ అని అన్నారు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నిరాడంబరమైన వ్యక్తి అని అన్నారు. బ్రిలియంట్‌ యాక్టర్‌ అని ప్రశంసించారు. విజయ్‌ దగ్గర చాలా విషయాలను నేర్చుకున్నట్టుగా ఈ బాద్షా తెలిపారు.

అట్లీ మీకు తమిళ్‌ నేర్పారా అని అడగ్గా ‘‘అట్లీ (Atlee), అనిరుద్‌ (Anirudh) కలిసి ఓ పాటలో నాతో కొన్ని లైన్లు లిప్‌ సింక్‌ చేయించారు. తమిళ్‌లో పాడాను. అవి బావుంటాయని నమ్ముతున్నాను’’ అని అన్నారు. ఈ ఏడాది అత్యంత భారీ యాక్షన్‌ చిత్రంగా విడుదలకానున్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్‌ నుంచి ఊహించని ట్వీట్

*Balagam: ఉత్త‌మ న‌టుడు సాయిలు, ఉత్త‌మ స‌హన‌టుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్

*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?

*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు

*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?

*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

Updated Date - 2023-05-08T19:37:46+05:30 IST