Parineeti Chopra: రాజకీయ నాయకుడిని పెళ్లాడనున్న హీరోయిన్!

ABN , First Publish Date - 2023-03-26T15:45:56+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఇషాక్ జాదే, కేసరి, సైనా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. పరిణీతి ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది.

Parineeti Chopra: రాజకీయ నాయకుడిని పెళ్లాడనున్న హీరోయిన్!

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఇషాక్ జాదే, కేసరి, సైనా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. పరిణీతి ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో రెండు సార్లు జంటగా వీరిద్దరు కనిపించడంతో ఆ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది.

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)ను పెళ్లాడబోతున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరికి మంచి పరిచయముంది. అనేక మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. ఫలితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అతి త్వరలోనే రోకా వేడుక జరగనుందని సమాచారం అందుతుంది. పెళ్లి కబురు త్వరలోనే వినిపించనున్నారని తెలుస్తోంది. కానీ, ఇద్దరు కూడా తమ రంగాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం వీలు చూసుకుని ఏదైనా ఒక తేదీలో రోకా వేడుక జరపుకొనున్నారట.

Raghav-Chadha.jpg

పరిణీ చోప్రా చివరగా ‘ఉంఛాయి’ (Uunchai)లో నటించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆమె చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఛమ్కీలా’, ‘క్యాప్సుల్ గిల్’ చిత్రాలు చేస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T15:45:57+05:30 IST