విరాజిత ఎవరో తెలుసా?

యూట్యూబ్‌ సిరీస్‌ వీక్షకులకు పరిచయం అక్కర్లేని నటి.

వైజాగ్‌లో పుట్టి పెరిగిన ఆమె.. మధ్యప్రదేశలో ఓ కంపెనీలో హెచఆర్‌గా పని చేశారు

చిన్నప్పటి నుంచి స్కిట్లు, డ్రామాలో నటించిన అనుభవం ఉంది

ఆ అనుభవం, నటన మీదున్న ఆసక్తితో జాబ్‌ వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టి ఆడిషన్స్  ఇవ్వడం మొదలుపెట్టారు.

ఓ చిత్రంలో హీరోయిన్ కి  డబ్బింగ్‌ చెప్పగా అది నచ్చి.. 'ఫీమేల్‌ ప్లాట్‌మేట్స్‌’ సిరీస్‌లో నటిగా అవకాశం వచ్చింది

ఆ సిరీస్‌ సక్సెస్‌ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. సక్సెస్‌ అందుకున్న నెలలోనే కరోనా, లాక్‌డౌన్ వచ్చింది

జాబ్‌ లేదు.. షూటింగ్స్‌ లేవు.. కెరీర్‌ ఏంటి? ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు విరాజిత

అయితే కొన్నాళ్లకే అంతా సెట్‌ అయింది. మళ్లీ తన షూటింగ్‌లతో బిజీ అయ్యారు

పెళ్లిచూపులు లవ్‌స్టోరీ, కొవిడ్‌ హాస్పటల్స్‌, 30ఎఫ్‌ అండ్‌ అన్  మ్యారీడ్‌, నువ్వే కావాలి, రాధాగోపాళం వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌, సిరీస్‌లతో తిరుగులేని గుర్తింపు పొందారు.

ప్రస్తుతం 'పెళ్లి వారమండి’ సిరీస్‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.

హీరోయిన్ గా కన్నా.. మంచి పెర్‌ఫార్మర్  అనిపించుకోవాలన్నదే ఆమె లక్ష్యం

విలనిజం, కోపం, అమాయకత్వం, అణిగిమణిగి ఉండే విభిన్న పాత్రలంటే విరాజితకు ఇష్టం.

తన చేసే పాత్రలో నటనకు ఆస్కారం ఉండాలి. స్కిన్ షో, ఇంటిమసీ సీన్స్  ఉండకూడదు