సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన, ఎస్తర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'టెనెంట్'. ఈ సినిమాకి దర్శకత్వం, కథనం, మాటలు వై యుగంధర్. ఏప్రిల్ 19న విడుదలవుతోంది.

నవదీప్, పంఖూరి గిద్వాని జంటగా నటించిన 'లవ్ మౌళి' కి దర్శకుడు అవనీంద్ర. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల. 

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకుడు, ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌ సినిమా. ఏప్రిల్ 19న విడుదల. 

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా వస్తున్న 'శశివదనే' సినిమాకి సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. గోదావరి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల. 

నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా వస్తున్న 'శరపంజరం' నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టి గణపతి రెడ్డి ,మల్లిక్ ఎంవీకే నిర్మాతలుగా వున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల

అర్జున్‌ అంబటి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తెప్ప సముద్రం'. సతీష్‌ రాపోలు దర్శకుడు. 'కొరమీను' ఫేమ్‌ కిశోరి ధాత్రక్‌ కథానాయిక, ఏప్రిల్ 19న విడుదల.

నారా రోహిత్ కథానాయకుడిగా వస్తున్న పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి 2'. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలవుతోంది

ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న సినిమా ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు, ఏప్రిల్ 25న విడుదల

సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో వస్తున్న ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఏప్రిల్ 26న విడుదలవుతోంది 

విశాల్ ఈసారి 'రత్నం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకుడు, ప్రియా భవాని శంకర్ కథానాయిక. ఏప్రిల్ 26న విడుదల