మ‌మితా బైజు.. కుర్ర‌కారుకు ఎందుకింత మోజు, క్రేజు

మ‌మితా బైజు ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా వినిపిస్తోన్న పేరు

కుర్ర‌కారులో..  విప‌రీత‌మైన‌ మోజు, క్రేజు

ఏ సోష‌ల్ మీడియా చూసినా..

అమెకు సంబంధించిన ఫొటోనో, వీడియోనో

 మ‌న‌కు క‌నిపించ‌కుండా ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు

అంత‌లా ఈ మ‌ల‌యాళ కుట్టి గుర్తింపును ద‌క్కించుకుంది

2017లో సినిమాల్లోకి..  ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది

ఇప్ప‌టివ‌ర‌కు  18 సినిమాలు చేసింది

2021లో మలయాళంలో ఆప‌రేష‌న్ జావా, ఖో ఖో

2022లో సూప‌ర్ శ‌ర‌ణ్య, 2023లో ప్ర‌ణ‌య విలాసం 

సినిమాల‌తో న‌టిగా గుర్తింపు

తాజాగా ప్రేమ‌లు సినిమాతో జాతీయంగా పేరు రావడమే కాక

స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది

ఆ సినిమా మ‌ల‌యాళంతో పాటు

 తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ  భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ అయింది

దీంతో.. అమ్మడికి అన్ని భాషల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి

 ఎక్కువగా సాంప్ర‌దాయ దుస్తులు ధరించేందుకే ఆస‌క్తి

అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు దూరంగా ఉంటుంది

కానీ హద్దులు దాటని లేటెస్ట్, ట్రెండింగ్,

ఫ్యాషన్ దుస్తుల‌ను ధ‌రిస్తూ

ఫొటో షూట్లు చేస్తుంటుంది

కేరళలో నగల, క్లాత్ షోరూంలకు బ్రాండింగ్ చేస్తోంది

ఈవెంట్లలో పాల్గొంటూ తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది

ఈ మధ్యే జీవీ ప్రకాశ్ తో  తమిళంలో రెబల్ సినిమా చేసింది

తాజాగా.. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఛాన్స్

దక్కించుకున్నట్లు  గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

చూడాలి తెలుగు నాట అమ్మ‌డి రాత ఎలా ఉంటుందో

మరో ప్రియా  ప్రకాశ్ వారియర్ అవుతుందో

సాయి పల్లవిగా పేరు తెచ్చు కుంటుందో..