కంగ‌నా.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఓ సినిమా చేసిన సంగ‌తి మీకు తెలుసా

బాలీవుడ్‌లో ఓ సినిమాలో హీరో  హీరోయిన్లుగా రోమాన్స్ చేసిన ఓ జంట 

ఎంపీలవ‌డ‌మే కాక‌, ఒకరు మంత్రి కావ‌డం విశేషం. ఆ జంటే చిరాగ్ పాశ్వాన్, కంగ‌నా 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  కంగ‌నా ఫస్ట్ టైం ఎంపీగా, పాశ్వాన్ మూడో సారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు

2011లో మిలే నా మిలే హ‌మ్  అనే హిందీ చిత్రంలో చిరాగ్ పాశ్వాన్ హీరోగా నటించాడు

అత‌ని స‌ర‌స‌న కంగ‌నా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టించగా ఈ జంట‌పై  మూడు పాట‌లు కూడా న్నాయి 

ఈ సినిమా అనంతరం చిరాగ్.. త‌న  తండ్రికి మ‌ద్ద‌తుగా రాజ‌కీయాల్లోకి వెళ్లి ఎంపీగా గెలిచి స్థిర పడ్డారు

తండ్రి మ‌ర‌ణానంత‌రం ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగాను వ్య‌వ‌హ‌రిస్తూ  పార్టీని ముందుండి న‌డిపిస్తున్నారు

తాజాగా మ‌రోసారి ఎంపీగా గెలిచి  కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా  బాధ్య‌తలు స్వీక‌రించారు

ఇక కంగ‌నాఅదే సంవ‌త్స‌రం వ‌చ్చిన త‌ను వెడ్స్ మ‌ను సినిమాతో స్టార్‌గా ఎదిగి బాలీవుడ్‌లో బిజీయెస్ట్ తారగా మారింది

 త‌రుచూ బాలీవుడ్‌పై, అడ‌పాద‌డ‌పా  శివ‌సేన వంటి పార్టీల‌పై త‌న‌ కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చింది

ఆపై బీజేపీలో చేరిన కంగ‌నా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టింది

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాశ్వాన్‌, కంగ‌నాలు ఎంపీ హోదాలో క‌లుసుకుని ప‌ల‌క‌రించ‌కున్నారు

ఈజంట క‌లిసి న‌టించిన  మిలే నా మిలే హ‌మ్ అనే చిత్రం

 ప్ర‌స్తుతం యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న‌ది ఆస‌క్తి ఉన్న‌వారు చూడొచ్చు