‘ఇట్లు అర్జున’తో నిర్మాతగా వెంకీ కుడుముల.. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:04 PM

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న విడుదల కానుంది. హీరో అనీష్‌ను పరిచయం చేయడం, నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం, ‘రాబిన్ హుడ్’ పరాజయం తదితర అంశాలపై ఏబీఎన్ ఎంటర్‌టైన్మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్‌తో వెంకీ కుడుముల ఇంటర్వ్యూ.

Venky Kudumula

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా మారారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం 'ఇట్లు అర్జున' ఈ నెల 13న జనం ముందుకు రాబోతోంది. దర్శకుడిగా తొలి చిత్రం 'ఛలో'తో చక్కని విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా తొలి చిత్రంతో అదే స్థాయి సక్సెస్ ను అందుకుంటారా? ప్రముఖ పారిశ్రామికవేత్త మహేశ్‌ రెడ్డి కుమారుడైన అనీష్‌ ను హీరోగా పరిచయం చేయడానికి కారణం ఏమిటీ? ఈ చిత్రానికి కింగ్‌ నాగార్జున సమర్పకుడిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దర్శకుడిగా తన గత చిత్రం 'రాబిన్ హుడ్‌' పరాజయానికి కారణం ఏమిటీ? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను వెంకీ కుడుమల నుంచి రాబట్టారు ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్మెంట్‌ ఎడిటర్‌ ఎన్.ఎస్.ఆర్. ఆ ఇంటర్యూను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి:

Renudesai: తమిళనాట వార్తల్లో నిలిచిన రేణు దేశాయ్ 

విడుదలకు ఒక్కరోజు ముందు ‘అ’ వాయిదా!

Siddu 10: సిద్దు.. నయన్.. ఓ రొమాంటిక్ డ్రామా

Updated Date - Nov 11 , 2026 | 08:07 PM