Vanda Devullu: హృదయాన్ని కదిలించేలా.. ‘అమ్మా అమ్మేగా’ సాంగ్!
ABN, Publish Date - May 02 , 2026 | 08:05 PM
విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రంలోని అమ్మ పాట ఎలాంటి క్రేజ్‌ని సొంతం చేసుకుందో తెలియంది కాదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఇప్పుడు మరో అమ్మపాటతో వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
విజయ్ ఆంటోని (Vijay Antony), శశి (Director Sasi) దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) చిత్రంలోని అమ్మ పాట ఎలాంటి క్రేజ్‌ని సొంతం చేసుకుందో తెలియంది కాదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి.. ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తర్వాత రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వంద దేవుళ్ళు’ (Vanda Devullu). ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘అమ్మ అమ్మేగా’ (Amma Ammega) అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘బిచ్చగాడు’లోని ‘వంద దేవుళ్లే దిగివచ్చినా..’ పాటతో భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’ అని అందరినీ మెప్పించేందుకు ఆయనే కలం కదిపారు. ‘అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్ హరిహరణ్ గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయని చెప్పొచ్చు. ఈ పాటను వింటే అమ్మ గొప్పదనం ఏంటో మరోసారి అర్థం అయ్యేలా చేశాను. ఇంకా చెప్పాలంటే హృదయాన్ని కదిలించేలా ఈ పాటను మేకర్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?
Updated at - May 02 , 2026 | 08:05 PM