‘ది ప్యారడైజ్’ మూవీ ‘ఏషనాగుల’ సాంగ్

ABN, Publish Date - Aug 29 , 2026 | 05:25 PM

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘ఏషనాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. సెప్టెంబర్ 24న పాన్-వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

‘దాయ్రా’లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్

శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!

‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్

Updated at - Aug 29 , 2026 | 05:25 PM