తరుణ్ భాస్కర్ ‘పులిహోర’ బాగానే కలిపాడుగా.. సాంగ్ వైరల్!
ABN, Publish Date - Apr 24 , 2026 | 09:50 PM
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్యకాలంలో హీరోగా వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ మూవీ నుంచి ‘ప్రేమకి పులిహోర’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.
దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఈ మధ్యకాలంలో హీరోగా వరస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ (Kasyap Sreenivas) దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’ (Gaayapadda Simham). ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పిస్తుండగా.. కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ప్రేమకి పులిహోర’ అనే లిరికల్ సాంగ్ (Premaki Pulihora Lyrical song)ని విడుదల చేశారు.
ఈ సాంగ్‌లో తరుణ్ భాస్కర్ హీరోయిన్ కోసం బాగానే పులిహోర కలుపుతున్నారు. టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడ్రన్ లవ్‌లో ఉండే ఆటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను ఈ పాటలో చూపించిన విధానం చాలా హ్యూమరస్‌గా, రిలేటబుల్‌గా ఉంది. స్వీకర్ అగస్తి ఈ పాటకు లైట్, బ్రీజీ ఫీల్‌తో ట్యూన్ అందించడంతో పాటు క్యాచీ లిరిక్స్ కూడా అందించారు. ఆయన రాసిన పదాలు నేటి ప్రేమలో ఉండే కన్ఫ్యూజన్, ఎగ్జైట్‌మెంట్‌ని తెలియజేస్తున్నాయి. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. తరుణ్ భాస్కర్, మానస చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. వారి మధ్య జరిగే క్యూట్, సరదా క్షణాలు, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి.. ఈ పాటను మరింత అందంగా మార్చాయి. మే 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!
తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!
పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!
Updated at - Apr 24 , 2026 | 09:50 PM