Mysaa: ‘ఏనాటి వరమో నువ్వు’ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Nov 16 , 2026 | 05:08 PM
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదలైంది
టాలీవుడ్ కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మైసా’ (Mysaa). రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఏనాటి వరమో నువ్వు’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్రబృందం.. ఇప్పుడు ఈ పాటతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక నటనలో మరో భిన్నమైన కోణాన్ని చూపించనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ:
తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్
Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది
కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు