Panchayat 5 Trailer: ఆకట్టుకుంటోన్న ‘పంచాయత్-5' ట్రైలర్
ABN, Publish Date - Nov 23 , 2026 | 11:20 PM
ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ‘పంచాయత్’ సరికొత్త సీజన్‌తో సిద్ధమవుతోంది.
ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ‘పంచాయత్’ సరికొత్త సీజన్‌తో సిద్ధమవుతోంది. ఈ పాపులర్ వెబ్‌సిరీస్ ఐదో భాగానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. టీవీఎఫ్ నిర్మాణంలో దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్ మరోసారి అభిషేక్ త్రిపాఠి పాత్రలో సందడి చేయనున్నారు. రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గత సీజన్ల మాదిరిగానే గ్రామీణ నేపథ్యంలో సాగే సరదా సంఘటనలు, చమత్కారమైన సంభాషణలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిసెంబరు 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. మరి ఆలస్యం ఎందుకు.. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి!