నా వైఫ్ మిస్సింగ్ నుంచి లిరికల్ వీడియో!
ABN, Publish Date - Oct 13 , 2026 | 11:50 AM
‘కొత్త బంగారు లోకం’ జంట వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ కంఠంనేని నిర్మాణంలో స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అరెరే విన్నావా’ లిరికల్ వీడియో విడుదలైంది.
సూపర్ హిట్ మూవీ 'కొత్త బంగారు లోకం'లో జంటగా నటించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి జత కట్టిన సినిమా ' నా వైఫ్ మిస్సింగ్'. ఈ సినిమా నుంచి ఇప్పటికీ టీజర్ విడుదలై, సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. అలానే తాజాగా లిరికల్ వీడియో విడుదలైంది. ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. అరెరే విన్నావా అంటూ సాగే ఈ పాటకు సాయి కార్తీక్ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి అంతే అందంగా పాడారు. శ్రీ సాయి కిరణ్ క్యాచీ లిరిక్స్ అందించారు. 'నా వైఫ్ మిస్సింగ్' మూవీ ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇవి కూడా చదవండి:
ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే
‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు
30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు