‘మహాకాళి’.. ‘శుక్రాచార్య వార్ క్రై’ గ్లింప్స్
ABN, Publish Date - Aug 24 , 2026 | 02:55 PM
‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’ స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది.
‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఆర్కేడీ స్టూడియోస్ సమర్పణలో పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ పేరుతో సోమవారం మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాను 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 3Dలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్
‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే
సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్
Updated at - Aug 24 , 2026 | 02:55 PM