Gurtimpu Trailer: మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదు
ABN, Publish Date - May 13 , 2026 | 10:36 PM
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ హీరోగా.. ఎస్‌కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మించిన స్పోర్ట్స్, కోర్ట్ డ్రామా చిత్రం ‘గుర్తింపు’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో కేజేఆర్ (KJR) హీరోగా.. ఎస్‌కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మించిన స్పోర్ట్స్, కోర్ట్ డ్రామా చిత్రం ‘గుర్తింపు’ (Gurtimpu). దేశంలోని క్రీడా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పనితీరు, పేదలు క్రీడలకు ఎంత దూరంలో ఉన్నారు అనే విషయాల ఇతివృత్తంగా దర్శకుడు జె.పి. తెన్ పతియాన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఓ పేదవాడు అథ్లెటిక్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. ఈ ప్రయాణంలో క్రీడా శాఖ మంత్రిని కోర్టు మెట్లు ఎందుకు ఎక్కించాడు.? అసలు అతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? కోర్టులో కోరుకున్న న్యాయం తనకి దక్కిందా? లేదా? అనే ఉత్సుకత కలిగించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ‘క్రికెట్ మన నేషనల్ గేమ్’.. ‘హాకీ మన నేషనల్ గేమ్’.. ‘మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదు’, ‘మీరందరూ చూసే పది సెకన్లు కాదు సార్ నా జీవితం.. దాని వెనకాల నా 29 ఏళ్ల జీవితం, శ్రమ ఉంది సర్.. మీట్‌కి వెళ్తే గెలుస్తాం.. కానీ అక్కడి వరకు వెళ్లలేకపోతున్నాం’.. వంటి డైలాగ్స్‌లో అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారనేది ఈ ట్రైలర్‌తో తెలిసిపోతోంది.
హీరోగా కేజేఆర్ లుక్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, పర్ఫామెన్స్ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ మూవీని జూన్‌లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. వీజీ వెంకటేష్, రంగరాజ్ పాండే, వసుంద్ర, మన్సూర్ అలీ ఖాన్, రామ్‌జీ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం
Updated at - May 13 , 2026 | 10:36 PM