‘గోల్డ్ స్పాట్’ నుంచి ఫస్ట్ సింగిల్ పరిచయమే విడుదల
ABN, Publish Date - Oct 12 , 2026 | 12:36 PM
అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ‘గోల్డ్ స్పాట్’ సినిమా నుంచి ‘పరిచయమే..’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. నరేన్ రెడ్డి స్వరపరిచిన ఈ పాటను తుషార నిలయతో కలిసి ఆయనే ఆలపించారు. భార్గవ కార్తీక్ సాహిత్యం అందించారు.
ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త మూవీ 'గోల్డ్ స్పాట్' . ఈ చిత్రాన్ని విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీచౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. సోమవారం 'గోల్డ్ స్పాట్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'పరిచయమే..' ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మెలొడీని మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ రెడ్డి కంపోజ్ చేసి సింగర్ తుషార నిలయతో కలిసి పాడారు. భార్గవ కార్తీక్ క్యాచీ లిరిక్స్ అందించారు. చిన్ననాటి స్నేహితులుగా నటించిర రామ్, శాంత మధ్య స్వీట్ మెలొడీగా చిత్రీకరించిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
అమలా పాల్ గ్లామరస్ ఫొటోలు వైరల్
సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం
కోబలి.. ఇది కదా కావాల్సింది రణబాలి
Updated at - Oct 12 , 2026 | 12:38 PM